Blood Pressure: బీపీ బెండు తీసే జ్యూసులు.. రోజుకొకటి చొప్పున తాగినా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు..
షుగర్ అంత కాకపోయినా ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న దీర్ఘకాలిక సమస్య బ్లెడ్ ప్రెజర్. ఇందులో హై బ్లడ్ ప్రెజర్.. లో బ్లడ్ ప్రెజర్ అని రెండూ ఉంటాయి. ఒకసారి వీటి బారిన పడితే ఇక జీవితాంతం మందులు మింగడం, ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవడం చేయాల్సి ఉంటుంది. బీపీని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడం, కంటినిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. అయితే బీపీతో బాధపడేవారికి ఆయుర్వేదంలో సహజమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

మన ఒంట్లో ఉంటూనే మనకు తీరని నష్టం చేసే బీపీ అనే మహమ్మారిని తరిమేయడానికి కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలున్నాయి. మనం రోజూ ఉపయోగించే దుంపలు, కూరలు, పండ్లనే కాస్త స్టైల్ మార్చి జ్యూసుల్లా తీసుకుంటే ఈ సమస్యకు రామబాణంలో పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే ఈ సమస్య నుంచి వెంటనే బయటపడొచ్చు. మరి ఇందులో బీపీని తగ్గించే పదార్థాలు.. వాటిలో ఉండే ఔషధ గుణాలేంటో మీరూ తెలుసుకోండి..
నారింజ పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇందులోని సి విటమిన్ కూడా శరీరం పోషకాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చర్మ ఆరోగ్యం కోసం, బ్లడ్ పెంచేందుకు బీట్ రూట్ జ్యూస్ ను ఎక్కువగా తీసుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇందులో బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే లక్షణం కూడా ఉంది. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే బీపీ వెంటనే కంట్రోల్ లోకి రావడంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఉండే నైట్రేట్ అనే పదార్థం రక్త నాళాలను సడలించి బీపిని తగ్గించగలదు.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపరిచి, బిపి తగ్గించడంలో సహాయపడతాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్, పొటాషియం ఉంటాయి. ఇవి బిపిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కలబంద శరీరాన్ని శుద్ధి చేస్తుంది. దీని రసం తాగితే రక్తపోటు తగ్గడంతో పాటు చర్మం కూడా నిగారిస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటుగా జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.
రక్తపోటు, హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది. పాలకూరలో మెగ్నీషియం, నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
టమోటాలో లైకోపీన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పుచ్చకాయలో “సిట్రుల్లైన్” అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరించి బిపిని తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూస్తుంది.