బిహార్ లో మళ్లీ పిడుగుల బీభత్సం.. 22 మంది మృతి
బిహార్‌ను భారీ వర్షాలు వదిలీ పెట్టడంలేదు. మరోసారి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడి 22 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవలే ఒకేరోజు 83 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరోసారి విషాద చోటుచేసుకుంది.

బిహార్‌ను భారీ వర్షాలు వదిలీ పెట్టడంలేదు. మరోసారి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడి 22 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవలే ఒకేరోజు 83 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరోసారి విషాద చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఇవాళ ఒక్కరోజే 22 మంది చనిపోయారు. ఈ ఘటనలపై స్పందించిన ఆ రాష్ట్రప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మారం చేసింది. కాగా, ఈ విషాదకర ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తానన్నారు. పిడుగుపాట్లకు బలైన 22 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా, గత 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 120 మంది పిడుగుపాట్లకు బలికావడంతో బీహార్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.