Corona Fund: కోవిడ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.5వేలు.. జనవరి 15 వరకే అవకాశం.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Corona Fund: కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలైన వారు కొందరైతే....
Corona Fund: కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలైన వారు కొందరైతే.. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు మరి కొందరున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా, తిండిలేక ఎన్నో కష్టాలను పడ్డారు. అదే అదనుగా భావించి కొందరు మోసగాళ్లు జనాలను బురిడికొట్టిస్తున్నారు. జనాలను కొత్త కొత్త పద్దతుల్లో మోసగిస్తున్నారు. మోసగాళ్లు బ్యాంకు ఖాతాలపై కన్నెసి ఖాతాలో ఉన్న డబ్బులన్ని తస్కరిస్తున్నారు.
వెలుగులోకి వచ్చిన కొత్తరకం మోసం
కరోనా సమయంలో మోసగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. కోవిడ్ పేరుతో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ అంశం వైరల్ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్ ఫండ్స్ నుంచిరూ.5వేలు అందిస్తోందని కొందరు సోషల్ మీడియాలో మెసేజ్‌లను వైరల్ చేస్తున్నారు. దీనికి ఆ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 15వ తేదీ చివరి గడువు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి మెసేజ్‌లను, లింక్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ జనాలను మోసగిస్తున్నారు మోసగాళ్లు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ తీసుకురాలేదు. మోసగాళ్లు సోషల్ మీడియాలో ఈ స్కీమ్ పేరుతో లింక్‌లను పెడుతూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దు..
ఇలాంటి మెసేజ్‌లను ప్రజలు నమ్మవద్దని ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్‌లను తీసుకురాలేదని, ప్రజలను మోసం చేసేందుకు మోసగాళ్లు ఇలాంటి మెసేజ్‌లను పార్వర్డ్ చేస్తూ నిలువునా మోసగిస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్‌లను ఎవ్వరికి కూడా షేర్ చేయవద్దని సూచించింది. మెసేజ్ లింక్‌లపై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఖాళీ చేస్తారని సూచించింది.
एक फर्जी मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार के हेल्थ मंत्रालय द्वारा कोरोना फंड के तहत ₹5000 की धनराशि प्रदान की जा रही है।#PIBFactcheck
▶️ ऐसे फर्जी संदेशों को फॉरवर्ड न करें।
▶️ इस तरह की संदिग्ध वेबसाइट पर अपनी किसी भी तरह की निजी जानकारी साझा न करें। pic.twitter.com/qiAbnHlJLi
— PIB Fact Check (@PIBFactCheck) January 11, 2022
ఇవి కూడా చదవండి: