దారుణం.. కొన్నిరోజుల్లోనే వివాహం.. పెళ్లి కొడుకు సహా ఇద్దరు సోదరీమణలు మంటల్లో సజీవదహనం

|

May 28, 2023 | 6:59 PM

ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందే పెళ్లికొడుకు, లేదా పెళ్లి కూతరు చనిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి విషాదమే పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకోనున్న పెళ్లికొడుకుతో పాటు అతని ఇద్దరు సోదరీమణులు సజీవదహనం అవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే దుర్గాపూర్ ప్రాంతంలో హఫ్నా సోరెన్ కుమారుడు మంగళ్ సోరెన్ (33) ఉంటున్నాడు.

దారుణం.. కొన్నిరోజుల్లోనే వివాహం.. పెళ్లి కొడుకు సహా ఇద్దరు సోదరీమణలు మంటల్లో సజీవదహనం
Representative Image
Follow us on

ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందే పెళ్లికొడుకు, లేదా పెళ్లి కూతరు చనిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి విషాదమే పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకోనున్న పెళ్లికొడుకుతో పాటు అతని ఇద్దరు సోదరీమణులు సజీవదహనం అవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే దుర్గాపూర్ ప్రాంతంలో హఫ్నా సోరెన్ కుమారుడు మంగళ్ సోరెన్ (33) ఉంటున్నాడు. అయితే ఇటీవలే మంగళ్ సోరెన్‌కు పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆదివారం రోజున వధువు తరపు కుటంబ సభ్యులు మంగళ్ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం తేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది. అందుకోసం మంగళ్ సోదరీమణులు సుమీ(33) బహమనీ(23) శుక్రవారం రోజునే పుట్టింటికి వచ్చారు.

సుమీ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుంది. బహమనీ గృహిణి. వీళ్ల తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. అయితే ఆయన తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూశాడు. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడిఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హఫ్నా కటుంబ సభ్యలకు అసలు ఎలాంటి సమస్యలు లేవని.. అసలు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..