మరో మూడు నాలుగు రోజుల్లో 300 శ్రామిక్ రైళ్లు.. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్

ఆయా రాష్ట్రాల్లో చిక్కుబడిన వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలో 300 శ్రామిక్ రైళ్లను  ప్రతిరోజూ నడపనున్నామని...

మరో మూడు నాలుగు రోజుల్లో 300 శ్రామిక్ రైళ్లు.. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 6:13 PM

ఆయా రాష్ట్రాల్లో చిక్కుబడిన వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలో 300 శ్రామిక్ రైళ్లను  ప్రతిరోజూ నడపనున్నామని, ఇందుకు ఆ యా రాష్ట్రాలు కూడా సహకరించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ కోరారు. ఈ మేరకుట్వీట్ చేస్తూ ఆయన.. ఇప్పటికీ  వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో వారంతా తమ స్వస్థలాలకు తరలేలా చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను తమ రాష్ట్రంలోకి అనుమతించడం లేదని, ఇది అన్యాయమని హోం మంత్రి అమిత్ షా నిన్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో రైల్వే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.

Latest Articles