AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Normal Monsoons: ఈసారి సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాలు ఇవే..

Normal Monsoons: ఈసారి రుతుపవనాలు సాధారణంగా లేవు.. సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు సాధారణం కంటే ఎక్కువ..

Normal Monsoons: ఈసారి సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాలు ఇవే..
Normal Monsoons
Shiva Prajapati
|

Updated on: Jul 23, 2022 | 5:51 AM

Share

Normal Monsoons: ఈసారి రుతుపవనాలు సాధారణంగా లేవు.. సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాలను పరిశీలిస్తే, జూలై 21 వరకు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే 61 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాకు గానూ 42 జిల్లాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో ఇతర 28 జిల్లాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. యూపీలోని 5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షాలు నమోదయ్యాయి.

జార్ఖండ్‌లో సాధారణం కంటే 51 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో బీహార్‌లో 47 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దేశంలోని 703 జిల్లాల్లో 80 జిల్లాలు సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యాయి.

ఆశించిన రుతుపవనాలతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని ఇంతకుముందు CII చెప్పిన విష‌యం తెలిసిందే. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యాపార రంగం పూర్తిగా అధిక వడ్డీ రేట్ల యుగం న‌డుస్తోందన్నారు. మంచి రుతుపవనాల కార‌ణంగా వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. దాంతో ముఖ్యంగా ఆహార, వాణిజ్య ద్రవ్యోల్భణం మెరుగుప‌డుతుంద‌న్నారు.

ఇవి కూడా చదవండి

మనీ9 అంటే ఏమిటి?

Money9 యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం ఏడు భాషల్లో అందుబాటులో ఉంది. ఇదొక ప్రత్యేకమైన సమాచారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైన వాటి గురించి తెలుసుకోండి. అందుకే Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.. మీ ఆర్థిక అవగాహనను పెంచుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి