AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio Q1 Results: లాభాల బాటలో రిలయన్స్‌ జియో.. త్రైమాసిక ఫలితాలు విడుదల

Reliance Jio Q1 Results: రిలయన్స్ జియో 2022-23 మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జియో లాభం 23.82 శాతం పెరిగి రూ.4335 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో ఈ కాలంలో..

Reliance Jio Q1 Results: లాభాల బాటలో రిలయన్స్‌ జియో.. త్రైమాసిక ఫలితాలు విడుదల
Reliance Jio
Subhash Goud
|

Updated on: Jul 22, 2022 | 7:20 PM

Share

Reliance Jio Q1 Results: రిలయన్స్ జియో 2022-23 మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జియో లాభం 23.82 శాతం పెరిగి రూ.4335 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో ఈ కాలంలో కంపెనీ ఆదాయం 21.55 శాతం పెరిగి రూ.17,994 కోట్ల నుంచి రూ.21,873 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ జియో ఆపరేటింగ్ మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు మెరుగుపడ్డాయి. అదే సమయంలో కంపెనీ ఆదాయం, లాభం, మార్జిన్ మార్కెట్ అంచనాల ప్రకారం ఉన్నాయి. ఇటీవలి TRAI జాతా ప్రకారం.. కంపెనీ మే నెలలో 31 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. మొత్తం చందాదారుల సంఖ్య రూ. 40.87 కోట్లకు చేరుకుంది.

జియో ఆదాయం గత త్రైమాసికంలో ఒక వినియోగదారుకు సగటు ఆదాయం పెరగడం, కొత్త కస్టమర్ల చేరిక కారణంగా పెరిగింది. కంపెనీ EBITDA 2022-23 మొదటి త్రైమాసికంలో 27.2 శాతం పెరిగి రూ. 10,964 కోట్లకు చేరుకుంది. అలాగే గత ఏడాది ఇదే కాలంలో రూ. 8,617 కోట్లుగా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇబిఐటిడిఎ 4.3 శాతం పెరిగింది. ఇది రూ.10,510 కోట్లు. 30 జూన్ 2022 నాటికి కంపెనీ నికర విలువ రూ. 2,02,132 కోట్లుగా ఉంది. ఇది జూన్ 2021లో రూ. 1,86,475 కోట్లు.

మరోవైపు, రిలయన్స్ జియోకి వచ్చే వారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జూలై 26, 2022 నుండి 5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. దీని కోసం కంపెనీ 14,000 కోట్ల రూపాయలను జమ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి