Shirdi Express: షిర్డీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. 30మంది మహిళల మెడలో బంగారం దోపిడీ..
షిర్డీ - కాకినాడ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న ట్రైన్.. మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్ వద్ద ఆగింది. ఇదే అదనుగా భావించిన దుండగులు.. బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను..మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న ట్రైన్.. మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్ వద్ద ఆగింది. ఇదే అదనుగా భావించిన దుండగులు.. బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి, మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. S2 నుంచి S11 వరకు మహిళలే టార్గెట్‌గా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పర్భణి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఆ మార్గంలో నడుస్తున్న రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాగా.. గతంలోనూ ఇదే రైలులో ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్రలోని రోటేగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో వస్తుండగా దోపిడి దొంగలు ఎస్ 3, ఎస్ 6 బోగీలలోకి ఎక్కారు. ప్రయాణికులపై దాడి చేసి, వారికి మారణాయుధాలు చూపి బెదిరించి పది తులాల బంగారు నగలు, పెద్ద మొత్తంలో నగదును, పలు విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం చైన్ లాగి దొంగలు రైలు దిగి పరారయ్యారు.
కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న రైలు దొంగలు ఒక్కసారిగా షిర్డీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో బీభత్సం సృష్టించడంతో ప్రయాణికులు వణికిపోయారు. కిటికీలు ఓపెన్‌చేసి మరీ మహిళల మెడల్లో నుంచి గోల్డ్ చైన్స్ తెంపుకుంటూ వెళ్లడంతో ట్రైన్‌లో అలజడి చెలరేగింది. ట్రైన్… పర్భణీ స్టేషన్‌కి వచ్చాక ఆర్పీఎఫ్‌కి కంప్లైంట్ చేశారు బాధితులు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.



