AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ఈ ప్రాంతాల్లో భద్రత పెంపు.

జమ్మూ కాశ్మీర్‎కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ రాజ్యంగంలోని 370 అధికరణ రద్దు చేసింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ జమ్ము-కాశ్మీర్ పార్టీలు గతంలో కూటమిగా ఏర్పడ్డాయి. అయితే దీనిపై గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో జమ్మూ కాశ్మీర్‎లోని కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ అంశంపై 2023 ఆగస్ట్ 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది.

Supreme Court: నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ఈ ప్రాంతాల్లో భద్రత పెంపు.
Supreme Court Judgment
Srikar T
|

Updated on: Dec 11, 2023 | 10:22 AM

Share

జమ్మూ కాశ్మీర్‎కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ రాజ్యంగంలోని 370 అధికరణ రద్దు చేసింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ జమ్ము-కాశ్మీర్ పార్టీలు గతంలో కూటమిగా ఏర్పడ్డాయి. అయితే దీనిపై గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో జమ్మూ కాశ్మీర్‎లోని కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ అంశంపై 2023 ఆగస్ట్ 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. నేడు ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించబోతున్నట్లు అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది.

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే తీర్పును రాజకీయం చేయవద్దని, ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ పలు రాజకీయ పార్టీలకు విన్నవించింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎన్‌సీ, పీడీపీలు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ)లో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పు నేపథ్యంలో కొందరు నాయకులను పోలీసులు ఇప్పటికే తమ అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..