AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: తొలిచూపులో ప్రేమ.. ఏకాంతంగా మాట.. ఊహించని సీన్ కు ప్రేమికుల ప్యూజులు ఔట్..

అందమైన పల్లెటూరుకు చెందిన యువతి ఓ వైపు.. సర్కస్ ఆడిస్తూ కుటుంబాన్ని పోషించుకునే యువకుడు మరోవైపు.. అనుకోకుండా ఓ రోజు వారిద్దరూ కలిశారు. సర్కస్ చూసేందుకు వచ్చిన యువతి.. ఆ యువకుడికి తొలి చూపులోనే..

Trending: తొలిచూపులో ప్రేమ.. ఏకాంతంగా మాట.. ఊహించని సీన్ కు ప్రేమికుల ప్యూజులు ఔట్..
Marriage
Ganesh Mudavath
|

Updated on: Jan 22, 2023 | 6:08 PM

Share

అందమైన పల్లెటూరుకు చెందిన యువతి ఓ వైపు.. సర్కస్ ఆడిస్తూ కుటుంబాన్ని పోషించుకునే యువకుడు మరోవైపు.. అనుకోకుండా ఓ రోజు వారిద్దరూ కలిశారు. సర్కస్ చూసేందుకు వచ్చిన యువతి.. ఆ యువకుడికి తొలి చూపులోనే నచ్చేసింది. అమ్మాయికి కూడా సేమ్ ఫీలింగ్. ఆలసించిన ఆశా భంగం.. అన్నట్లుగా వాళ్లిద్దరూ ఏ మాత్రం లేట్ చేయకుండా ఒకరినొకరు మాట్లాడుకునేందుకు రెడీ అయ్యారు. అలా ఎవరూ లేని సమయంలో ఏకాంతంగా కలిశారు. వారు అనుకున్నట్లు జరిగితే అంతా బాగానే ఉండేది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. ఏకాంతంగా ఉన్న వారిని చూసిన ఊరివాళ్లు కోపంతో ఊగిపోయారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ.. ఇద్దరినీ పట్టుకున్నారు. వీధుల్లో లాక్కెళ్తూ.. గ్రామంలోని గుడికి తీసుకెళ్లారు. అంతటితో ఆగుకండా యువకుడితో యువతికి బలవంతంగా పెళ్లి జరిపించారు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కళ్లు తేలేశారు ఆ నవ దంపతులు..

బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లాలోని షకురాబాద్ ప్రాంతానికి చెందిన బికాష్ కుమార్.. సర్కస్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒకరోజు సర్కస్ ఆడిస్తున్న సమయంలో అతనికి ఓ అమ్మాయి కనిపించింది. ఆమె బికాష్ సర్కస్ ప్రదర్శనకు వచ్చింది. అక్కడ వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొద్ది రోజుల తర్వాత.. బికాష్.. ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. దీనిని ఆ ఊరి వాళ్లు చూశారు. దీంతో యువతీ యువకులు క్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.

అయినా గ్రామస్థులు వారిని విడిచిపెట్టలేదు. వెంబడించి మరీ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఇద్దరినీ గ్రామంలోని గుడికి తీసుకెళ్లారు. దైవం సమక్షంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. అబ్బాయితో అమ్మాయి నుదుటను కుంకుమ దిద్దించి వారితో ఏడడుగులు వేయించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.