Ganga Vilas: గంగా విలాస్ జర్నీ స్టార్ట్.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని.. 51 రోజులు.. 50 చారిత్రక ప్రదేశాలు..

గంగా విలాస్‌ లగ్జరీ క్రూయిజ్‌ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌ వారణాసి నుంచి 31మంది టూరిస్టులతో 51రోజుల జర్నీ స్టార్ట్‌ చేసింది. మరి.. తొలి టూర్‌లో చోటు దక్కించుకున్న ఆ అదృష్టవంతులెవరు?. ఏఏ ప్లేస్‌ను...

Ganga Vilas: గంగా విలాస్ జర్నీ స్టార్ట్.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని.. 51 రోజులు.. 50 చారిత్రక ప్రదేశాలు..
Ganga Vilas
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 14, 2023 | 6:14 AM

గంగా విలాస్‌ లగ్జరీ క్రూయిజ్‌ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌ వారణాసి నుంచి 31మంది టూరిస్టులతో 51రోజుల జర్నీ స్టార్ట్‌ చేసింది. మరి.. తొలి టూర్‌లో చోటు దక్కించుకున్న ఆ అదృష్టవంతులెవరు?. ఏఏ ప్లేస్‌ను క్రూయిజ్‌ టచ్‌ చేయనుంది?. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి పొడవైన రివర్‌ క్రూయిజ్‌ టూర్‌ మొదలైంది. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా క్రూయిజ్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్‌ వారణాసి నుంచి గంగా విలాస్‌ లగ్జరీ క్రూయిజ్‌ తొలి ప్రయాణం ప్రారంభించింది. అత్యంత విలాసవంతమైన ఈ క్రూయిజ్‌… వారణాసి నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా 27 ఉపనదుల గూండా 3వేల 2వందల కిలోమీటర్లు ప్రయాణించనుంది. రవిదాస్‌ ఘాట్‌ నుంచి మొదలైన ఫస్ట్‌ టూర్‌లో 31మంది ప్రయాణికులు ఈ మధురానుభవాన్ని ఆస్వాదిస్తున్నారు.

మొత్తం 50 చారిత్రక ప్రదేశాల మీదుగా 51 రోజుల పాటు తొలి ప్రయాణం సాగునుంది. మొదటి టూర్‌లో అందరూ విదేశీయులే ఉన్నారు. స్విట్టర్లాండ్‌, జర్మనీకి చెందిన 31మంది ఫస్ట్‌ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారణాసి నుంచి మొదలైన క్రూయిజ్‌… పట్నా, కోల్‌కతా మీదుగా బంగ్లాలోకి ఎంట్రీ ఇస్తుంది. 15 రోజుల తర్వాత మళ్లీ భారత జలాల్లోకి ప్రవేశిస్తుంది. మెయిన్‌గా, గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా ప్రయాణం సాగుతుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, అభయారణ్యాల గూండా వెళ్తుంది క్రూయిజ్‌. చివరిగా అస్సోం దిబ్రూగర్‌ దగ్గర టూర్‌ ముగుస్తుంది.

మొత్తం 51రోజుల పాటు సాగే ఈ లగ్జరీ జర్నీకి ఒక్కొక్కరికీ 20లక్షల రూపాయలు ఛార్జ్‌ చేస్తున్నారు నిర్వాహకులు. అత్యంత విలాసవంతమైన ఈ లగ్జరీ క్రూయిజ్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు ఉన్నాయి. జిమ్‌, స్పా, లైబ్రరీతోపాటు సూపర్‌ ఆరేంజ్‌మెంట్స్‌ ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్ టూర్‌ని మీరూ ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా?. అయితే రెండేళ్లు ఆగాల్సిందే! ఎందుకంటే, మీ దగ్గర 20లక్షల రూపాయలు రెడీగా ఉన్నా… రెండేళ్ల వరకు బుకింగ్స్‌ క్లోజ్‌ అంటోంది కంపెనీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!