Trending Video: వామ్మో.. ఏంది ఇది.. కొండపై వింత జీవి.. చూస్తే భయంతో పరుగులు పెట్టాల్సిందే..
లక్షల సంవత్సరాల క్రితం భూమిపై విచిత్రమైన జంతువులు ఉండేవని సైన్స్ చెబుతోంది. కాలక్రమంలో అవి అంతరించిపోయి కనుమరుగైపోయాయి. అలాంటి వెరైటీగా ఉన్న జంతువులను చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. అప్పుడప్పుడు...
లక్షల సంవత్సరాల క్రితం భూమిపై విచిత్రమైన జంతువులు ఉండేవని సైన్స్ చెబుతోంది. కాలక్రమంలో అవి అంతరించిపోయి కనుమరుగైపోయాయి. అలాంటి వెరైటీగా ఉన్న జంతువులను చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. అప్పుడప్పుడు అలాంటి వింత జంతువులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అనేక రకాలైన డైనోసార్‌లు మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై నివసించాయని నమ్ముతారు. అనేక వింత జీవులపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి జంతువును మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. కొండ ప్రాంతంలోని అడవిలో తెల్లటి రంగు జంతువు సంచరిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. అది చాలా వింతగా కనిపిస్తుంది. ఇది మౌంటెన్ మేక అని తెలుస్తోంది. అడవులలో పర్వతాలపై మాత్రమే కనిపిస్తుంది. ఈ మేకలు సాధారణ మేకలకు కొంచెం భిన్నంగా ఉంటాయి. వాటి పరిమాణం కూడా చాలా పెద్దది. ఇవి పర్వతాలను సులభంగా ఎక్కుతాయి. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 6 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు 15 మిలియన్లకు పైగా అంటే 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 4 లక్షల 62 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
Huge muscular mountain goat seen in forest ? pic.twitter.com/9gdCMgpvCK
— OddIy Terrifying (@OTerrifying) January 8, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..