Wedding Video: ఇలాంటి లైఫ్ పార్ట్నర్ దొరికితే మనసు హాయిగా ఉంటుంది.. ఫిదా చేస్తున్న పెళ్లి వీడియో.. మీరూ చూసేయండి..
పెళ్లి అనేది అపురూపమైనది. పెళ్లి చూపులు నుంచి అప్పగింతల వరకు ప్రతి ఘట్టం.. ఎంతో అపురూపం. ఇక హల్దీ, మెహందీ ఫంక్షన్లు, బరాత్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. వధూవరులు జయమాల వేసుకునే సన్నివేశం కూడా...

పెళ్లి అనేది అపురూపమైనది. పెళ్లి చూపులు నుంచి అప్పగింతల వరకు ప్రతి ఘట్టం.. ఎంతో అపురూపం. ఇక హల్దీ, మెహందీ ఫంక్షన్లు, బరాత్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. వధూవరులు జయమాల వేసుకునే సన్నివేశం కూడా చాలా అందంగా ఉంటుంది. వధూవరుల అందమైన క్షణాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పెళ్లి వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎప్పుడు తెరపైకి వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. ఈ వీడియోలను చూసిన తర్వాత చాలాసార్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. భారతీయ వివాహంలో జయమాల ఆచారం చాలా ముఖ్యమైనది. అయితే కాలంతో పాటు ఈ ఆచారంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ క్షణాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి వధూవరులు వెరైటీగా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. వేదికపై జయమాల వేసుకునేందుకు వధూవరులు సిద్ధంగా ఉన్నారు. కానీ కాళ్ళలో ఫ్రాక్చర్ కారణంగా.. వరుడు నిలబడలేకపోతాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న వధువు.. ఎంతో ప్రేమగా వరుడికి మాల వేసింది. తనకు మాల వేయాల్సినప్పుడు వరుడికి దగ్గరగా వెళ్లి.. అతని ముందు మోకాలిపై కూర్చుంటుంది. దీంతో వరుడు ఆమె మెడలో జయమాల వేస్తాడు. ఈ సమయంలో వరుడు లేచి నిలబడటానికి ప్రయత్నించినా.. వధువు ప్రేమను అతను కాదనలేకపోయాడు.




View this post on Instagram
ఈ వీడియోను తియాసన్కర్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వార్త రాసే సమయానికి 84 వేల మందికి పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఇలాంటి భాగస్వామి దొరకడం చాలా అదృష్టం అని రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..