Huge Bill: ఇది కదా పార్టీ అంటే .. రెస్టారెంట్ బిల్లు చూస్తే కళ్లు తేలేస్తారు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిల్..
దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. విందువినోదాలతో గ్రాండ్‌గా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని ఓ రెస్టార్ంట్ ఓ బిల్లును
దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. విందువినోదాలతో గ్రాండ్‌గా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని ఓ రెస్టార్ంట్ ఓ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లు వాల్యూ.. 6,20,926 దిర్హామ్.. అంటే మన దేశ కరెన్సి లో సుమారు 1,39,67,807 రూపాయలు. డౌన్‌టౌన్‌లోని ఒక GAL రెస్టారెంట్ కు సంబంధించింది ఈ బిల్లు. న్యూ ఇయర్ సందర్భంగా 18 మంది అతిథులు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారని.. వారు అందరూ కలిసి ఈ భారీ బిల్లును సమర్పించినట్లు రెస్టారెంట్ యజమాని మెర్క్ తుర్క్‌మెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆ బిల్లుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని షేర్ చేసి.. తుర్క్‌మెన్ ఇది “మొదటిది కాదు, చివరిది కాదు” అని క్యాప్షన్ ఇచ్చారు.. తన రెస్టారెంట్‌ను ట్యాగ్ చేశారు. యాపిల్ జ్యూస్, లాట్, గ్రీన్ టీ, కోకా-కోలా వంటి డ్రింక్స్ సహా అనేక రకాల పానీయాలు, కాక్‌టెయిల్‌లు తాగినట్లు ఈ భారీ బిల్లు ద్వారా తెలుస్తోంది. అదే విధంగా, అబుదాబిలోని నస్ర్-ఎట్ స్టీక్‌హౌస్ లో కూడా 615,065 దిర్హామ్( Dhs) భారీ బిల్లు వెలుగు చూసింది. నస్రెట్ గోక్సే రెస్టారెంట్ యజమాని .. చెఫ్ ఈ బిల్లుకి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ UAE ప్రజలు ఎంతో ఇష్టపడి పార్టీలు చేసుకున్నారు.. విందు వినోదం కోసం భారీగా ఖర్చు పెట్టారు కూడా. ఇప్పుడు ఈ బిల్లు నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

