లాక్ డౌన్ ను అతిక్రమించినందుకు భలే శిక్ష.. 500 సార్లు ఏం రాశారంటే

హరిద్వార్.. రిషికేష్ లో లాక్ డౌన్ అతిక్రమించిన కొంతమంది విదేశీయులకు ఓ పోలీసాయన విచిత్రమైన 'శిక్ష 'విధించాడు. వీరంతా 'సారీ'.'సారీ' (క్షమించాలి) అని 500 సార్లు రాయాలంటూ వింతయిన పనిష్మెంట్ ఇచ్చాడు.

లాక్ డౌన్ ను అతిక్రమించినందుకు భలే శిక్ష.. 500 సార్లు ఏం రాశారంటే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 12, 2020 | 3:07 PM

హరిద్వార్.. రిషికేష్ లో లాక్ డౌన్ అతిక్రమించిన కొంతమంది విదేశీయులకు ఓ పోలీసాయన విచిత్రమైన ‘శిక్ష ‘విధించాడు. వీరంతా ‘సారీ’.’సారీ’ (క్షమించాలి) అని 500 సార్లు రాయాలంటూ వింతయిన పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక్కడి తపోవన్ ప్రాంతంలో దాదాపు 500 మంది విదేశీయులు కొంతకాలంగా ఉంటున్నారు. అయితే వీరిలో చాలామంది లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఇష్టం వఛ్చినట్టు రోడ్లమీద తిరుగుతుంటే వారిని ఏం చేయాలో ఈ పోలీసు అధికారికి తోచలేదు. అందుకే.. లాక్ డౌన్ నిబంధనలను నేను పాటించ లేదు..క్షమించాలి అంటూ పదిమంది విదేశీయులు  రాయాల్సి వచ్చింది. లాక్ డౌన్ రూల్స్ ని తేలిగ్గా తీసుకునేవారికి ఇదో గుణపాఠం అంటున్నాడా ఖాకీ !