AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Police: యూపీలో తెలంగాణ పోలీసుల రెయిడ్‌.. ఇద్దరు క్రిప్టో క్రిమినల్స్‌ అరెస్ట్.. రూ.9 కోట్లు స్వాధీనం

ఉత్తరప్రదేశ్‌లోని చందోలి జిల్లా మొఘల్‌సరాయ్‌కి చెందిన బడా వ్యాపారవేత్త కొడుకు అభిషేక్‌ జైన్‌. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ పేరుతో హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలువురికి టోకరా వేశాడు.

Telangana Police: యూపీలో తెలంగాణ పోలీసుల రెయిడ్‌.. ఇద్దరు క్రిప్టో క్రిమినల్స్‌ అరెస్ట్.. రూ.9 కోట్లు స్వాధీనం
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2022 | 8:28 AM

Share

Telangana Police Raids in UP: తెలంగాణ పోలీసులు.. యూపీలో రెయిడ్‌ చేసి క్రిప్టో మోసగాడిని పట్టుకున్నారు. తొమ్మిది కోట్లకు పైగా క్యాష్‌ను స్వాధీనం చేసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని చందోలి జిల్లా మొఘల్‌సరాయ్‌కి చెందిన బడా వ్యాపారవేత్త కొడుకు అభిషేక్‌ జైన్‌. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ పేరుతో హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలువురికి టోకరా వేశాడు. తక్కువ సమయంలో సొమ్ము రెట్టింపు అవుతుందని ఆశ చూపి, క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా చాలామందిని ముగ్గులోకి దించాడు. అదంతా వట్టి మోసమని తర్వాత తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తెలంగాణ సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు.

కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన అభిషేక్‌ జైన్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. మొఘల్‌సరాయ్‌లోని రవి నగర్‌లో అతని ఇంటిపై తెలంగాణ పోలీసులు రెయిడ్‌ చేశారు. అతని ఇంట్లో తొమ్మిది కోట్ల నగదును గుర్తించారు. ఆ సొమ్ముతో పాటు అతని నుంచి కొన్ని సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు కన్నయ్య యాదవ్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇద్దరు నిందితులను మొఘల్‌సరాయ్‌ ఎస్పీతో కలిసి తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ యాప్‌తో తెలంగాణలో ఎలా మోసాలకు పాల్పడిందీ సమాచారం రాబట్టారు.

ఇప్పటికే అభిషేక్‌ జైన్‌పై హైదరాబాద్‌ మూడు కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌తో తక్కువ టైమ్‌లోనే సొమ్ము రెట్టింపు అవుతుందని ఆశ చూపి, తన ఉచ్చులో పడిన వాళ్లను అతను నిండా ముంచేశాడని హైదరాబాద్‌ సైబర్‌ సెల్‌ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అభిషేక్‌ జైన్‌ను ట్రాక్‌ చేసి పట్టుకున్నారు. నిందితుడిని మొఘల్‌సరాయ్‌ కోర్టులో హాజరుపర్చి, ట్రాన్సిట్‌ రిమాండ్‌ తీసుకుని హైదరాబాద్‌ తీసుకువస్తున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!