Rajya Sabha Elections: రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

Rajya Sabha: తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటి ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది..

Rajya Sabha Elections: రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
Rajya Sabha
Follow us

|

Updated on: May 12, 2022 | 6:37 PM

Rajya Sabha: తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటి ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్‌ (Election Commission‌). వీటికి ఈ నెల 24న నోటిఫికేషన్‌ రానుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 3 వరకు గడువు ఉంది. జూన్‌ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌, విజయసాయిరెడ్డి, సురేష్‌ప్రభు పదవీ కాలం ముగుస్తోంది. తెలంగాణలో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డీఎస్‌ పదవీ కాలం అయిపోతోంది. మరోవైపు రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న వారిలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, పియూష్‌గోయల్‌ కూడా ఉన్నారు. ఏపీలో బలాల ప్రకారం నాలుగు సీట్లు వైసీపీకే వస్తాయి. ఆ నాలుగింటిలో విజయసాయిరెడ్డికి మళ్లీ ఇవ్వడం ఖాయం. మిగిలిన మూడు సీట్లలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు, గ్రీన్‌ కో కంపెనీ సునీల్, నిర్మాత -న్యాయవాది నిరంజన్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బండ ప్రకాష్‌ రాజీనామాతో ఇప్పటికే ఒక సీటు ఖాళీ అయింది. అది కాకుండా మరో రెండు సీట్లకు షెడ్యూల్‌ వచ్చింది. మొత్తం మూడు సీట్లకు ప్రధానంగా మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ పేరు వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెత్కుపల్లి నర్సింహులు, సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటితోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 24న నోటిఫికేషన్‌ వస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 3 వరకు గడువు ఉంది. జూన్‌ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. బలాల ప్రకారం ఏపీలో నాలుగు సీట్లు వైసీపీకి, తెలంగాణలో రెండు సీట్లు టీఆర్‌ఎస్‌కే వస్తాయి. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌, విజయసాయిరెడ్డి, సురేష్‌ప్రభు పదవీ కాలం ముగుస్తోంది. తెలంగాణలో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డీఎస్‌ పదవీ కాలం అయిపోతోంది. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కొత్తగా ఎవరు రాజ్యసభ ఎంపీలవుతారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న వారిలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, పియూష్‌గోయల్‌ కూడా ఉన్నారు.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయగా, అందులో ఏపీలో 4, తెలంగాణలో 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి