Humanity: కొడుకులిద్దరూ ప్రభుత్వం ఉద్యోగులే.. అయినా తల్లి భారం.. గత 10 ఏళ్లుగా ఇంట్లో బంధించి బిస్కట్లే ఆహారంగా ఇచ్చిన తనయులు
Humanity: మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలేనా అనే విధంగా రోజు రోజుకీ అనేక దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక అమ్మ వందమంది పిల్లలైనా ప్రేమగా పెంచుతుంది.. అయితే అదే..
Humanity: మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలేనా అనే విధంగా రోజు రోజుకీ అనేక దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక అమ్మ వందమంది పిల్లలైనా ప్రేమగా పెంచుతుంది.. అయితే అదే వందమంది పిల్లలకు తల్లి భారంగా మారుతుందని పెద్దలు చెప్పిన మాటను నిజంగా కన్న తల్లిని భారంగా భావిస్తూ అనాథలుగా వదిలేస్తున్న తనయులు ఎందరో.. అయితే కొంతమంది.. తమకు ఆర్ధిక భారం అని ఓ రీజన్ చెబితే.. తాజాగా తమిళనాడులో (Tamilandu ) మానవత్వం ఉందా అనిపించే దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తల్లిని ఓ ఇంట్లో పెట్టి.. ఇద్దరు కుమారులు ఇంటికి తాళం వేశారు. ఇంట్లో బలహీనమైన స్థితిలో తన ఇంటిలో వివస్త్రగా పడి ఉన్న మహిళ వీడియో సోషల్ మీడియాలో (Social Media) దర్శనమిచ్చింది. అంతేకాదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో 72 ఏళ్ల మహిళను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం రక్షించారు. వివరాల్లోకి వెళ్తే..
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. SW డిపార్ట్‌మెంట్ మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181కి మహిళ గురించి కాల్ వచ్చింది. దీంతో ఇద్దరు సిబ్బంది ఎం విమల, దివ్య తంజావూరులోని కావేరీ నగర్‌లోని ఇంటికి చేరుకున్నారు. వారు ఇరుగుపొరుగు వారిని విచారించగా జ్ఞానజ్యోతి అనే మహిళను ఆమె కుమారులు ఇంట్లో బంధించినట్లు తెలిసింది. దీంతో అధికారులు తలుపులు పగులగొట్టి వృద్ధురాలిని రక్షించారు. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉండడంతో ఆ మహిళ లేవలేకపోయిందని.. హింసాత్మకంగా ప్రవర్తించిందని విమల చెప్పింది. దీంతో వెల్ ఫేర్ సిబ్బంది వృద్ధురాలికి మానసిక చికిత్స అందించడానికి ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై విమల మాట్లాడుతూ.. వృద్ధురాలి పేరు జ్ఞానజ్యోతి అని .. ఆమె భర్త దూరదర్శన్‌లో పనిచేసేవారని 2009లో మరణించారని తెలిపింది. తండ్రి మరణించిన అనంతరం జ్ఞానజ్యోతిని ఆమె కుమార్తె చూసుకుంది. అయితే దురదృష్టవశాత్తు.. తండ్రి మరణించిన రెండేళ్లకు కూతురు కూడా మరణించింది. దీంతో జ్ఞానజ్యోతి బాధ్యత కుమారులపై పడింది.. వారికీ తల్లిని ఇంటికి తీసుకుని వెళ్లండం ఇష్టం లేకపోవడంతో.. కుమారులు వృద్ధురాలికి ఓ ఇంట్లో పెట్టి.. ఆ ఇంటికి తాళం వేశారు. గత 10 సంవత్సరాలుగా వారానికి ఒకసారి మాత్రమే ఆహారం, బిస్కెట్లను తల్లికి ఇచ్చేవారని ఇరుగుపొరుగు చెప్పారు. అంతేకాదు ఇరుగుపొరుగు అందించే నీళ్లతోనే ఆ వృద్ధురాలు బతుకుతుందని అన్నారు.
జ్ఞానజ్యోతి కుమారులు రిటైర్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ షణ్ముగసుందరం, దూరదర్శన్ వెంకటేశన్‌లోని టెక్నికల్ ఉద్యోగిగా గుర్తించారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 కింద ఇద్దరు కుమారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని SW నిర్ణయించింది.