AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate: చాక్లెట్‌ కోసం నదినే ఈది.. సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన బాలుడు… 15 రోజులు రిమాండ్‌

Chocolate: చాక్లెట్‌ని ఇష్టపడని వారు బహు అరుదు. వయసు, జెండర్ తో సంబంధం లేదు.. ఎవరైనా సరే చాక్లెట్ ని ఇష్టంగా తింటారు. అయితే ఒక్క చాక్లెట్ కోసం బాలుడు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా నదినే ఈదుకుంటూ..

Chocolate: చాక్లెట్‌ కోసం నదినే ఈది.. సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన బాలుడు... 15 రోజులు రిమాండ్‌
Chocolate Lover
Surya Kala
|

Updated on: Apr 16, 2022 | 4:42 PM

Share

Chocolate: చాక్లెట్‌ని ఇష్టపడని వారు బహు అరుదు. వయసు, జెండర్ తో సంబంధం లేదు.. ఎవరైనా సరే చాక్లెట్ ని ఇష్టంగా తింటారు. అయితే ఒక్క చాక్లెట్ కోసం బాలుడు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా నదినే ఈదుకుంటూ సరిహద్దులు దాటి వచ్చాడు. చివరికి జైలుపాలయ్యడు. భారత్-బంగ్లాదేశ్ (India -Bangladesh Boarder)సరిహద్దులోని షాల్డా నది సమీప గ్రామానికి చెందిన బాలుడు ఇమాన్ హొసైన్‌కు భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం. వాటిని తినాలని కోరిక కలిగినప్పుడల్లా నదిని ఈదుకుంటూ త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వచ్చి చాక్లెట్లు కొనుక్కుని వచ్చిన దారినే వెళ్తుండేవాడు. ఏప్రిల్‌ 13న మరోసారి చాక్లెట్ల కోసం వచ్చిన బాలుడు బీఎస్ఎఫ్ సిబ్బంది కళ్లలో పడ్డాడు.. బాలుడిని పట్టుకున్నవారు స్థానిక పోలీసులకు అప్పగించారు. బాలుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.

విచారణ సమయంలో బాలుడు చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే తనకెంతో ఇష్టమని, వాటిని కొనుక్కునేందుకు వస్తుంటానని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. అతడి వద్ద 100 బంగ్లాదేశీ టాకాలను గుర్తించారు. అతడి వద్ద అక్రమంగా మరేవీ లేవని తెలిపారు. బాలుడి వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు ఏవీ లేకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరోసారి బాలుడిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, బాలుడి గురించి ఇప్పటి వరకు అతడి కుటుంబ సభ్యులు ఎవరూ భారత అధికారులను సంప్రదించలేదు.

Also Read: AP Weather Alert: ఏపీ వాసులకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు.. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Humanity: కొడుకులిద్దరూ ప్రభుత్వం ఉద్యోగులే.. అయినా తల్లి భారం.. గత 10 ఏళ్లుగా ఇంట్లో బంధించి బిస్కట్లే ఆహారంగా ఇచ్చిన తనయులు