Watch Video: బెంచ్‌పై పడుకొని స్టూడెంట్స్‌తో కాళ్లు పట్టించుకున్న హెడ్‌మార్టర్.. వీడియో వైరల్.. ఎక్కడంటే!
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించినాల్సి ఉపాద్యాయులే ఈ మధ్య మతితప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వీడియోలో ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తరగతి గదిలోని బెంచ్‌పై పడుకొని ఒక విద్యార్థితో కాళ్లు నొక్కించుకోవడం మనం చూడవచ్చు. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది.

ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు క్లాస్ రూమ్‌లోని బెంచ్‌పై పడుకొని విద్యార్థులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఘటన తమిళనాడులోని ధర్మపురిలో వెలుగుచూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించడంతో అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన హరూర్‌లోని మావేరిపట్టి ప్రాథమిక పాఠశాలలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలలో స్థానిక గ్రామానికి చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కలైవాణి.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది మరిచి.. వాళ్లతో కాళ్లునొక్కించుకుంటుంది. ఇంది చూసి సదురు సిబ్బంది ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన జనాలు ఆ ఉపాధ్యాయురాలు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లను పాఠశాలకు పంపడానికి నిరాకరించి పాఠశాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఇందులో నిజానిజాలు లేర్చేందుకు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు స్వయంగా పాఠశాలకు వెళ్లి సంబంధిత ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులతో విచారణ జరపాలని జిల్లా ప్రాథమిక విద్య అధికారి విజయకుమార్, వట్టదాక్షియర్ పెరుమాళ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యప్రియకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ తర్వాత ఆధారాలను బట్టి ప్రధానోపద్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
వీడియో చూడండి..
தலைமை ஆசிரியை செய்ற வேலையா இது… முகம் சுளிக்க வைக்கும் காட்சி | School Head Master | Kumudam News#KumudamNews24X7 #kumudamnews #justnow #dharmapuri #headmaster #schoolheadmaster #viralvideo #schoolstudents #hmissue #govtschool #latestnewstamil pic.twitter.com/pbpDDzmPDh
— Kumudam News 24×7 (@kumudamNews24x7) September 3, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
