MK Stalin: నూతన రాజకీయాలకు నాంది పలుకుతున్న సీఎం స్టాలిన్.. కరోనా నియంత్రణకు విపక్ష పార్టీలతో కమిటీ..

Tamil Nadu - MK Stalin: తమిళనాడులో అధికారం చేపట్టిన నాటి నుంచి నూతన రాజకీయాలకు నాంది పలుకుతూ.. తన మార్కు పాలనతో ఆకట్టుకుంటున్నారు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. గతంలో

MK Stalin: నూతన రాజకీయాలకు నాంది పలుకుతున్న సీఎం స్టాలిన్.. కరోనా నియంత్రణకు విపక్ష పార్టీలతో కమిటీ..
Mk Stalin
Follow us

|

Updated on: May 17, 2021 | 10:57 PM

Tamil Nadu – MK Stalin: తమిళనాడులో అధికారం చేపట్టిన నాటి నుంచి నూతన రాజకీయాలకు నాంది పలుకుతూ.. తన మార్కు పాలనతో ఆకట్టుకుంటున్నారు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. గతంలో తమిళనాడులో ఉన్న ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి ఆయన కొత్త సాంప్రదాయనికి తెరతీశారు. కోవిడ్‌పై పోరాటంలో భాగంగా.. 13 మంది ఎమ్మెల్యేలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. అయితే దీనిలో 12 ప్రతిపక్ష పార్టీ నేతలే ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీలో ఏఐఏడీఎంకే నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి విజయ్ భాస్కర్ కూడా సభ్యుడిగా ఉన్నారు. మే 13న కరోనా పరిస్థితులపై జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం స్టాలిన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ కమిటీలో ముఖ్యమంత్రి స్టాలిన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (ఏఐఏడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలైకుమార్ (ఎండీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), నాగై మాలి (సీపీఎం), డాక్టర్ జవహారుల్లా (ఎంఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టీ వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ) సభ్యులుగా కొనసాగనున్నారు. అయితే.. కరోనా పోరులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీతో.. పాలక మండలి రాష్ట్రంలో ప్రత్యేక మార్పునకు నాంది పలికిందని, స్టాలిన్ సరికొత్త రాజకీయానికి నాంది పలికారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ గురించి ఏఐఏడీఎంకే నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి విజయ్‌కుమార్ స్పందించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిపి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా మండలికి, ప్రభుత్వానికి నా సంపూర్ణ సహకారం అందిస్తానంటూ ట్విట్ చేశారు. కరోనా మొదటి వేవ్‌ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా రాష్ట్రంలో మహమ్మారి నియంత్రణకు కృషిచేస్తానని తెలిపారు.

Also Read:

Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్