Omicron Effect: ఆ విద్యార్థులను మాత్రమే కాలేజీలోకి అనుమతించండి.. కీలక ఆదేశాలు జారీ చేసిన సర్కార్..!

|

Dec 11, 2021 | 9:35 AM

Omicron Effect: యూనివర్శిటీలు, కాలేజీల ప్రాంగణాల్లోకి టీకాలు వేసిన విద్యార్థులకే ప్రవేశం కల్పించాలని తమిళనాడు ఆరోగ్య శాఖ శుక్రవారం రాష్ట్రంలోని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖను కోరింది.

Omicron Effect: ఆ విద్యార్థులను మాత్రమే కాలేజీలోకి అనుమతించండి.. కీలక ఆదేశాలు జారీ చేసిన సర్కార్..!
Students
Follow us on

Omicron Effect: యూనివర్శిటీలు, కాలేజీల ప్రాంగణాల్లోకి టీకాలు వేసిన విద్యార్థులకే ప్రవేశం కల్పించాలని తమిళనాడు ఆరోగ్య శాఖ శుక్రవారం రాష్ట్రంలోని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖను కోరింది. చెన్నైలోని ఒక కళాశాలలో తొమ్మిది మంది విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో.. కాలేజీల్లో కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలకు ఉపక్రమించారు. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మా సుబ్రమణియన్, దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు అధ్యక్షతన వివిధ విశ్వ విద్యాలయాలు, కాలేజీల ఉన్నతాధిరులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాలేజీల్లోకి విద్యార్థులను అనుమతించడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, రోజు తప్పించి రోజు తరగతుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. కోవిడ్ -19 ప్రోటోకాల్‌కు కట్టుబడి విద్యాసంస్థలు పని చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.

చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇటీవల తొమ్మిది మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్ష చేయగా.. వారికి పాజిటివ్ అని తేలింది. దీంతో టీకాలు వేసిన విద్యార్థులను మాత్రమే కళాశాలలు, విశ్వవిద్యాలయాలలోకి అనుమతించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు తమిళనాడులో కేవలం 46 శాతం మంది విద్యార్థులు మాత్రమే మొదటి డోస్‌ వ్యాక్సీన్ పొందగా, 12 శాతం మంది విద్యార్థులు రెండో డోస్‌ను పొందారని మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలతో పాటు.. క్యాంటీన్‌లలోనూ కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలని మంత్రి స్పష్టం చేశారు. ‘‘క్లాసులలో, క్యాంటీన్‌‌లలో విద్యార్థులు తప్పకుండా కోవిడ్ 19 నిబంధనలు పాటించేలా విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల్లో పార్టీలు, సాంస్కృ‌తిక కార్యక్రమాలు వంటి వాటిని నిషేధించాలి.’’ అని మంత్రి తేల్చి చెప్పారు.

Also read:

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..