Crime News: తండ్రిని చంపిన కిరాతకుడు.. అడ్డొచ్చిన తల్లి, చెల్లిని కూడా..

|

Apr 23, 2023 | 1:10 PM

ప్రేమలో విఫలమైన కొడుకు మనస్తాపానికి గురై కొన్ని నెలలుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంతలో ఏం జరిగిందో ఒక్కసారిగా కొపోధ్రిక్తుడై కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా మెడపై కాలుతో తొక్కి దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్‌ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Crime News: తండ్రిని చంపిన కిరాతకుడు.. అడ్డొచ్చిన తల్లి, చెల్లిని కూడా..
Man Kills Father In Chennai
Follow us on

ప్రేమలో విఫలమైన కొడుకు మనస్తాపానికి గురై కొన్ని నెలలుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంతలో ఏం జరిగిందో ఒక్కసారిగా కొపోధ్రిక్తుడై కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా మెడపై కాలుతో తొక్కి దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్‌ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్ర తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని పచూర్‌ ప్రాంతంలో కాపురం ఉంటున్న మోహన్‌ (55), అతని భార్య వరమతి (50) దంపతులు. వీరికి గిరి (32), ముత్తు (28) అనే ఇద్దరు కుమారుల, సంధ్య (20) అనే కుమార్తె సంతానం. వృత్తి రిత్యా రైతు అయిన మోహన్‌ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. వీరి రెండో కుమారుడు ముత్తు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఐతే ఆమె ముత్తు ప్రేమను తిరస్కరించడంతో.. మనస్తాపానికి గురైన ముత్తు మూడు నెలలుగా ఇంటిలో నుంచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ముత్తు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై తండ్రి మోహన్‌ మెడను కాలుతో నొక్కి హత్య చేశాడు. భయభ్రాంతులకు గురైన తల్లి వరమతి, చెల్లెలు సంధ్య అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని కూడా కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో ఇద్దరూ ఇంటిలో స్పృహతప్పి పడిపోయారు. వారి కేకలు విన్న ఇరుగు పొరుగు ముత్తును బంధించి తాళ్లతో కట్టేశారు.

అనంతరం నాట్రంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన వరమతి, సంధ్యలరె ఇరుగుపొరుగు చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మోహన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ముత్తును అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.