‘ఇది తాలిబన్ల తరహా పాలన’..కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై బీజేపీ మండిపాటు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై బీజేపీ మండిపడింది. ఈ అరెస్టు రాజ్యాంగ విలువల అతిక్రమణేనని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విలువలను ఉల్లంఘించిందని, కానీ తామేమీ భయపడబోమని...
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై బీజేపీ మండిపడింది. ఈ అరెస్టు రాజ్యాంగ విలువల అతిక్రమణేనని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విలువలను ఉల్లంఘించిందని, కానీ తామేమీ భయపడబోమని, తమను అణచివేయజాలరని ఆయన అన్నారు. జన ఆశీర్వాద యాత్రల సందర్భంగా బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఈ ప్రభుత్వం (మహారాష్ట్ర) ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతాం..మా ఈ ప్రయాణం కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. అటు రాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం, బీజేపీ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్.. ఇది తాలిబన్ల తరహా పాలన అని నిప్పులు చెరిగారు. నారాయణ్ రాణే వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించబోదని, కానీ పార్టీ మాత్రం 100 శాతం ఆయన వెంటే ఉంటుందని ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కక్షా రాజకీయాలకు పాల్పడుతోందని, ఇందుకు పోలీసులను వినియోగించుకుంటోందని ఆయన అన్నారు. శాంతి భద్రతలు ఉండాలే గానీ తాలిబన్ల తరహా పాలన కాదన్నారు.
ప్రతీకారంతోనే రాణాపై ఈ చర్య తీసుకున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ఆ తరువాత మరాఠీలో ట్వీట్ చేశారు. ఇది కొత్త హిందుత్వ అని, కొత్త మహారాష్ట్ర అని ఎద్దేవా చేశారు. ఇలా ఉండగా నారాయణ్ రాణే పై నాలుగు ఎఫ్ ఐ ఆర్ లు దాఖలయ్యాయి. ఆయనను పోలీసులు రాయగడ్ కు తరలించారు. తమ క్లయింటుపై దాఖలైన కేసులను కొట్టివేయాలని కోరుతూ రాణే తరఫు లాయర్లు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఈ రోజే వీటిని దాఖలు చేయాల్సినంత అవసరం ఏమిటని.. తగిన పద్దతిని పాటించాలని కోర్టు సూచించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.
హౌస్ అరెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్..: House Arrest Pre-Release Event Live Video.
Ek Number News Live Video: ధూంధాంగా దేవునికోడె అంత్యక్రియలు | ప్రేమజంటకు లగ్గం చేసిన సంఘపోళ్లు..