Birthday Cake: బర్త్‌డే కేక్ తిని చిన్నారి మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కారణం ఏమిటో తెలిసి అంతా షాక్!
బర్త్‌డే కేకు తిని మృత్యువాత పడిన పంజాబ్‌కు చెందిన పదేళ్ల బాలిక మాన్వి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేక్ తిన్న తర్వాత గంటల వ్యవధిలోనే బాలిక చనిపోవడం అందరినీ షాక్‌కి గురి చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది. చిన్నారి మాన్వితిన్న కేకులో అధిక సాంధ్రత కలిగిన కృత్రిమ స్వీటెనర్ ఉన్నట్లు దర్యాప్తులో సోమవారం అధికారులు గుర్తించారు. మాన్వి మృతికి..

పంజాబ్, ఏప్రిల్ 23: బర్త్‌డే కేకు తిని మృత్యువాత పడిన పంజాబ్‌కు చెందిన పదేళ్ల బాలిక మాన్వి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేక్ తిన్న తర్వాత గంటల వ్యవధిలోనే బాలిక చనిపోవడం అందరినీ షాక్‌కి గురి చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది. చిన్నారి మాన్వితిన్న కేకులో అధిక సాంధ్రత కలిగిన కృత్రిమ స్వీటెనర్ ఉన్నట్లు దర్యాప్తులో సోమవారం అధికారులు గుర్తించారు. మాన్వి మృతికి అసలు కారణం ఇదేనని అధికారులు చెబుతున్నారు.
మాన్వి మృతికి అసలు కారణం ఇదే..
మార్చి 24న పంజాబ్‌లోని పాటియాలాలోని ఓ బేకరి నుంచి చాక్లెట్‌కేక్ ను ఆన్‌లైన్‌లో డెలివరీ చేసిన.. ఆ కేకును తిని మాన్వితో సహా చిన్నారి కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైంది. ఈ ఘటన అనంతరం కేకు నమూనాను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాంబ్‌కు తరలించగా.. అందులో ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ ‘సాచరైన్ ను’ అధిక మోతాదులో వాడినట్లు జిల్లా ఆరోగ్య అధికారి DHO డాక్టర్ విజయ్ జిందాల్ తెలిపారు. బేకరీ ఆహారాలు, పానియాల్లో దీన్ని అతి తక్కువ మోతాదులో ఉపయోగిస్తుంటారు. అయితే మోతాదుకు మించి తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది.
ਪਟਿਆਲਾ ਤੋਂ ਦੁਖਦਾਈ ਖ਼ਬਰ ਕਿਉਂਕਿ ਅਦਾਲਤ ਬਜ਼ਾਰ ਵਿਖੇ ਕੇਕ ਕਾਨ੍ਹਾ ਤੋਂ ਔਨਲਾਈਨ ਆਰਡਰ ਕੀਤਾ ਜਨਮ ਦਿਨ ਦਾ ਕੇਕ ਖਾਣ ਤੋਂ ਬਾਅਦ 10 ਸਾਲਾ ਬੱਚੀ ਮਾਨਵੀ ਦੀ ਮੌਤ ਹੋ ਗਈ ਅਤੇ ਪਰਿਵਾਰ ਦੇ ਪੰਜ ਮੈਂਬਰ ਬੀਮਾਰ ਹੋ ਗਏ। ਪੁਲਸ ਨੇ ਬੇਕਰੀ ਦੀ ਦੁਕਾਨ ਦੇ ਮਾਲਕ ਖਿਲਾਫ ਸ਼ਿਕਾਇਤ ਦਰਜ ਕਰ ਲਈ ਹੈ। pic.twitter.com/a32TooKeth
— Jes Bhullar (@jesbhullar) March 30, 2024
చిన్నారి మాన్వి మృతికి కారణమైన కేక్ తయారు చేసిన బేకరీపై త్వరలో చర్యలు తీసుకుంటామని, భారీ మొత్తంలో జరిమానా కూడా విధిస్తామని అధికారుల తెలిపారు. కాగా ఇప్పటికే బేకరీ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది. కేక్ తయారు చేసిన బేకరీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ బేకరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని అధికారులు వెల్లడించారు. బర్త్‌డే వేడుకల్లో ఆనందంగా కేకు తింటున్న మాన్వి ఫ్యామిలీకి చెందిన వీడియో ప్రతిఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.