AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటోతో ప్రేమలో పడ్డ బ్రిటన్‌ దంపతులు.. లండన్‌ వరకు తీసుకెళ్లి హల్‌చల్‌ చేస్తున్నారు..!

బ్రిటన్‌కు చెందిన హెలెన్, మిక్ అనే విదేశీ దంపతులు భారతదేశంపై ఉన్న ప్రేమతో చెన్నైలో ఒక ఎర్రటి ఆటో రిక్షాను కొనుగోలు చేశారు. టిమ్మి అని పేరుపెట్టిన ఈ ఆటోపై వారు భారతదేశంలో దాదాపు 75 రోజుల్లో 4,218 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేశారు. భారతీయ సంస్కృతిని, ప్రయాణ అనుభవాలను ఆస్వాదించిన ఆ దంపతులకు ఆటోతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. చివరకు తమ పర్యటన ముగిశాక, ఆ ఆటోను ఇక్కడే వదిలి వెళ్లలేక సముద్ర మార్గం ద్వారా షిప్పింగ్ చేసి దానిని బ్రిటన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ ఆటో లండన్‌కు చేరుకోగా, అక్కడ కూడా దానితో ప్రయాణించేందుకు వారు సిద్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆటోతో ప్రేమలో పడ్డ బ్రిటన్‌ దంపతులు.. లండన్‌ వరకు తీసుకెళ్లి హల్‌చల్‌ చేస్తున్నారు..!
British Couple Indian Auto
Jyothi Gadda
|

Updated on: Oct 27, 2026 | 2:22 PM

Share

భారతదేశం అంటే విదేశీయులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, రంగులమయమైన జీవితం వారిని ఎంతగానో కట్టిపడేస్తుంటాయి. అయితే బ్రిటన్‌కు చెందిన ఒక సాహస దంపతులు మాత్రం మన దేశంపై ఉన్న అంతులేని ప్రేమను చాటుకుంటూ ఒక అరుదైన సాహసానికి పాల్పడ్డారు. భారతదేశంలో ప్రయాణించేందుకు ఒక ఆటో రిక్షాను కొనుగోలు చేసి, దానిపై దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరగడమే కాకుండా, చివరికి ఆ ఆటోను ఏకంగా తమ సొంత దేశానికే షిప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

చెన్నైలో మొదలైన ప్రయాణం:

బ్రిటన్‌కు చెందిన హెలెన్, మిక్ అనే దంపతులు భారతదేశాన్ని వినూత్న రీతిలో చుట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వారు తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక ఎర్రటి రంగు బజాజ్ ఆటో రిక్షాను కొనుగోలు చేశారు. ఆ ఆటోకు సరదాగా టిమ్మి ది టిన్ క్యాన్ అని పేరు పెట్టారు. ఆటో ముందు భాగంలో క్యూట్ కళ్ళు, స్మైలీ డిజైన్ వేయించి, దానికోసం ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా పేజీని కూడా క్రియేట్ చేశారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లో 4,218 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం:

ఈ విదేశీ జంట తాము కొనుగోలు చేసిన ఆటోపైనే భారతదేశమంతా చుట్టేశారు. తమిళనాడు నుంచి బయలుదేరి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తాజ్ మహల్, గోవా బీచ్‌లు ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ సుమారు 75 రోజుల్లో మొత్తంగా 4,218 కిలోమీటర్ల దూరాన్ని ఆటోపైనే విజయవంతంగా పూర్తి చేశారు. భారతీయ రోడ్లపై ఆటో నడుపుతూ స్థానికులతో మమేకమైన జ్ఞాపకాలను వారు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకోగా, వాటికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది.

ఆటోను వదిలి వెళ్లలేక లండన్‌కు షిప్పింగ్:

భారత్‌లో తమ ప్రయాణం ముగిసిన తర్వాత, ఆ దంపతులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కానీ, తాము ఎంతో అప్యాయంగా తిరిగిన ఆ టిమ్మి ఆటోను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లడానికి వారి మనసు ఒప్పుకోలేదు. దాంతో వారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆటోను సముద్ర మార్గం ద్వారా షిప్ చేసి బ్రిటన్‌కు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు.

View this post on Instagram

A post shared by Timmy (@timmy_the_tin_can)

సుమారు 6 నెలల ప్రయాణం తర్వాత ఆటో లండన్ గేట్‌వే పోర్ట్‌కు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. భారతీయ ఆటోతో ఇప్పుడు వారు యూకే వీధుల్లో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒక సాధారణ ఆటోతో విదేశీ దంపతులు చేసిన ఈ అద్భుతమైన ప్రయాణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us