తమిళనాడులో కలకలం.. సినీ ఫక్కీలో జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..
తమిళనాడులు ఏకంగా 17 మంది ఖైదీలు సినీ ఫక్కీలో ఒకేసారి జైలు నుంచి తప్పించుకున్నారు. ఒక పథకం ప్రకారం మూర్చ వచ్చినట్లు నటించి, జైలు అధికారులపై దాడికి పాల్పడి తప్పించకున్నారు. జైలు ప్రధాన ద్వారం గుండా వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

తమిళనాడులోని తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఒక సెల్‌లో ఉన్న కొందరు ఖైదీలు పరారయ్యేందుకు తొలుత ఒకరు మూర్ఛ నాటకమాడినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆ గదిలోకి ప్రవేశించగానే.. దాడి చేసి పరారయ్యారు. అయితే ఖైదీల పరారీపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఖైదీల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కేరళ సరిహద్దుల్లో పోలీసుల పహారా పెంచారు. దిండుక్కల్, తిరునల్వేలిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. మరో 14 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక సెల్‌లో ఉన్న కొందరు ఖైదీలు పరారయ్యేందుకు తొలుత ఒకరు మూర్ఛ నాటకమాడినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆ గదిలోకి ప్రవేశించగానే.. దాడి చేసి పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.
ఈ జైల్లో ఒకే గదిలో మొత్తం 17 మంది రిమాండ్ ఖైదీలు ఉంటున్నారు. అధికారుల కళ్లు గప్పి జైలు నుంచి తప్పించుకోవాలని వారందరూ ముందుగానే ఒక ప్లాన్ రచించారు. ఈ ప్లాన్ ప్రకారం సోమవారం రాత్రి ఆ గదిలోని ఖైదీలలో ఒకతడు అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినట్లు నటిస్తూ అరిచాడు. దీంతో జైలు గార్డులైన తంగపాండియన్, మదన్, స్టాలిన్ బాబు, పాల్పాండి అతడికి సహాయం చేయడానికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో 17 మంది ఖైదీలు కలిసి వంటకు ఉపయోగించే పళ్ళాలు, ఇనుప పాత్రలతో జైలు గార్డులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం జైలు ప్రధాన ద్వారం గుండా మెరుపు వేగంతో పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురు గార్డులను చికిత్స కోసం తేని ప్రభుత్వ ఆస్పతికి అధికారులు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తుండగా.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెస్తోంది. 17 మంది ఖైదీలు ఒకేసారి జైలు నుంచి తప్పించుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జైలు నుంచి ఖైదీలు పారిపోయారన్న సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జైలును తనిఖీ చేసిన పోలీసులు.. వెంటనే అప్రమత్తం అయ్యారు. స్నిఫర్ డాగ్ సహాయంతో జైలు వెనుక అడవిలో దాక్కున్న కొంమందిని పట్టుకున్నారు. పట్టుబడిన ఖైదీలను జైలు లోపలికి తీసుకెళ్లి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మిగతా ఖైదీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 17 ప్రత్యేక దళాలు ఖైదీల కోసం గాలింపు చేపడుతున్నాయి. త్వరలోనే మిగతా ఖైదీలను కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఒకేసారి 17 మంది ఖైదీలు ఒక జైలు నుంచి తప్పించుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది. జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
