‘సుశాంత్ రాజ్ పుత్ కాడు’, బీహార్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య

సుశాంత్ సింగ్ కేసులో ఈడీ, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శరవేగంగా దేనికవే దర్యాప్తు జరుపుతుండగా బీహార్ ఎమ్మెల్యే ఒకరు అసలు సుశాంత్ రాజ్ పుత్ కాడన్న వాదనను తెరపైకి తెచ్చారు.

  • Umakanth Rao
  • Publish Date - 5:46 pm, Thu, 17 September 20
'సుశాంత్ రాజ్ పుత్ కాడు', బీహార్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య

సుశాంత్ సింగ్ కేసులో ఈడీ, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శరవేగంగా దేనికవే దర్యాప్తు జరుపుతుండగా బీహార్ ఎమ్మెల్యే ఒకరు అసలు సుశాంత్ రాజ్ పుత్ కాడన్న వాదనను తెరపైకి తెచ్చారు. మహారాణా వంశంలో పుట్టినవారెవరూ ఆత్మహత్య చేసుకోరని ఆర్జెడీకి చెందిన అరుణ్ యాదవ్ అనే అనే ఈ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసలు రాజ్ పుత్ లు తాము చనిపోయే ముందు ఇతరులను చంపుతారు అని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్ తనకు ఎదురైన సమస్యలపై పోరాడవలసి ఉంటే బాగుండేదని,ఆయన పేర్కొన్నారు. అయితే కులం సమస్యను తెచ్చినందుకు తాను క్షమాపణ చెప్పాలన్న బీజేపీ, జెడి-యు నేతల డిమాండును అరుణ్ యాదవ్ తోసిపుచ్చారు. కాగా ఈ ఎమ్మెల్యేగారి వ్యాఖ్యలు బీహార్ లో వివాదాన్ని, సంచలనాన్ని రేకెత్తించాయి.