Justice Chandrachud: రైతు అప్పు చెల్లించలేదని సుప్రీంకోర్టుకు వెళ్లిన బ్యాంక్.. న్యాయమూర్తి ఏమన్నారంటే..?
పెద్దోళ్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలు వెళ్ళిపోతే ఏం చెయ్యలేవు బ్యాంకులు. అదే సామాన్య రైతులు ఒక్క వాయిదా కట్టకపోయినా.. పెద్ద నేరం జరిగిపోయినట్లు నోటీసులు ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు అయితే సదరు రైతులు లోన్లు కట్టలేదంటూ ఫోటోలతో హోర్డింగులు పెడతాయి.
బ్యాంక్‌ల ప్రతాపం పేదల మీదేనా. పెద్దోళ్ల మీద ఉండదా? ఇదే డైలాగ్ కొట్టారు సుప్రీంకోర్టు(Supreme Court) జస్టిస్ చంద్రచూడ్. ఓ రైతు అప్పు చెల్లించలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది ఓ బ్యాంక్. ఫైనల్‌గా ఆ బ్యాంక్ తీరునే తప్పుబట్టారు జస్టిస్ చంద్రచూడ్. మీ ప్రతాపం రైతుల మీద, వాళ్ల ఫ్యామిలీల మీద ఆపి దేశంలో అప్పులు ఎగ్గొట్టిన బడా బాబులను పట్టుకోండి అంటూ తరిమేశారు. సరిగ్గా చూస్తే.. ఇదే కాన్సెప్ట్ ఈవారం రిలీజైన సర్కార్ వారి పాట(sarkar vaari paata) సినిమాలోనూ చూడొచ్చు. పేద, మద్యతరగతి వాళ్ల అప్పులపై రికవరీల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు. విజయ్ మాల్యా(Vijay Mallya), నీరవ్ మోడీ(Nirav Modi) లాంటి పేర్లు వినిపిస్తే వెంటనే గుర్తు వచ్చేది బ్యాంక్ ఫ్రాడ్స్. బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పలు తీసుకున్న వారు హాయిగా విదేశాల్లో తిరుగుతుంటే.. ఇక్కడ చిన్నచిన్న అప్పులు చేసిన వారిని మాత్రం ఆ అప్పు తీర్చమని వేధిస్తున్నాయి బ్యాంకులు. అయితే ఇలా లోన్ రికవరీ విషయంలో బ్యాంక్‌లు చూపిస్తున్న తేడానే సర్కారువారి పాట సినిమా కాన్సెప్ట్.
సినిమాకు, సుప్రీంకోర్టులో జస్టిస్ కామెంట్స్‌కు నేరుగా సంబంధం లేదుగానీ.. కాన్సెప్ట్ మాత్రం అదే. ‘ముందు పెద్ద చేపల వెంట పడండి. ఇలాంటి పిటీషన్ల వల్ల రైతుల కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతాయి’ అంటూ కామెంట్ చేశారు జస్టిస్ చంద్రచూడ్. ఆ బ్యాంక్ పిటిషన్‌ను కొట్టివేశారు. సర్కార్ వారి పాటలో సినిమాలో మెయిన్ ఫ్లాట్‌గా తీసుకున్నది కూడా బ్యాంక్ రుణం తీర్చలేని మధ్యతరగతి బాదితుడి కష్టాలే. ఈ సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన ఇదే కాన్సెప్ట్ నిజ జీవితంలో సుప్రీం కోర్టు ముందు ప్రస్తావనకు రావటంతో సినిమాను రియల్ ఇన్సిడెంట్‌ను కంపార్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
#SupremeCourt dismisses plea by a bank against farmers for recovery of loan. Justice Chandrachud remarks “Go after bigger fish. Such a litigation in Supreme Court will spoil the families of farmers financially.”
— LawBeat (@LawBeatInd) May 13, 2022