AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET-PG Counselling: ఈడబ్ల్యూఎస్‌ కోటాపై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సుప్రీం కోర్టు

NEET-PG Counselling: నీట్‌ పీజీ ప్రవేశాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కేసులో సత్వరం విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం..

NEET-PG Counselling: ఈడబ్ల్యూఎస్‌ కోటాపై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సుప్రీం కోర్టు
Subhash Goud
|

Updated on: Jan 04, 2022 | 12:52 PM

Share

NEET-PG Counselling: నీట్‌ పీజీ ప్రవేశాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కేసులో సత్వరం విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం విన్నవించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణను బుధవారం చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. నీట్‌-పీజీ కౌన్సిలింగ్‌లో జాప్యానికి వ్యతిరేకంగా రెసిడెంట్‌ వైద్యుల నిరసన దృష్ట్యా కేసును అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తు షార్‌ మెహతా మంగళవారం సీజేఐ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ తెలిపారు. అయితే రేపు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసిన విచారణ చేపడతామని సీజేఐ తెలిపారు. ఈ వారంలో ఇద్దరు న్యాయమూర్తులు ఉండటంతో రేపు ముగ్గురు న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కాగా, నీట్‌ పీజీ ప్రవేశాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కేసులో సత్వరం విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం  విన్నవించింది. విచారణ చేపట్టేందుకు మంగళవారం వీలు కాకపోతే బుధవారం విచారణ నిర్వహించాలని కోరింది. దీంతో రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఈడబ్ల్యూఎస్‌ కోటా వర్తింపునకు పునః సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో రెసిడెంట్‌ వైద్యుల నిరసనలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

One Moto India: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన ప్లాంట్‌.. భారీగా ఉద్యోగ అవకాశాలు

Deadlines: వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌.. 2022లో చేసుకోవాల్సిన పనులు ఇవే.. గడువు దాటితే పెనాల్టీ..!