AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సహజీవనంపై సుప్రీంకోర్టులో పిటీషన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం

ఇటీవల యువతీ యువకుల మధ్య సహజీవనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ విషంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

సహజీవనంపై సుప్రీంకోర్టులో పిటీషన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
Supreme Court Of India
Aravind B
|

Updated on: Mar 20, 2023 | 4:35 PM

Share

ఇటీవల యువతీ యువకుల మధ్య సహజీవనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ విషంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ సంబంధాలను రిజిస్టర్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది తెలివి తక్కువ ఆలోచన అని పిటిషన్‌దారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ను తన సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్‌ పూనావాలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాణి అనే మహిళ సుప్రీంకోర్టు లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సహజీవన సంబంధాల్లో అత్యాచారాలు, హత్యల వంటి నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బంధాలన్నింటినీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇలా రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల సహజీవనంలో ఉండే వ్యక్తుల పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండటంతో పాటు, అత్యాచార కేసులు కూడా తగ్గుతాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌తో సహజీవనం చేసేవారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేదా అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని కోర్టు ఆమెను ప్రశ్నించింది. సహజీవన బంధాలను నమోదు చేసుకుని కేంద్రం ఏం చేసుకుంటుంది.. ఇది ఎంతటి తెలివితక్కవ పని అని మండిపడింది. ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నామని ధర్మాసం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం..

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..