Summer Precautions: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. గుండె రోగులను ట్రాక్ చేయాలని రాష్ట్రాలకు ఆరోగ్య కార్యదర్శి లేఖ

|

Mar 02, 2023 | 3:00 PM

ఈ ఏడాది ఎండలు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి రాష్ట్రాలు కచ్చితంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి డేటా సేకరించి అలర్ట్‌గా ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు.

Summer Precautions: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. గుండె రోగులను ట్రాక్ చేయాలని రాష్ట్రాలకు ఆరోగ్య కార్యదర్శి లేఖ
Follow us on

మార్చి ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండ వేడి మొదలవుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది హీట్ వేవ్స్ వస్తాయనే వార్తలు నేపథ్యంలో ప్రజలు ఎండ వేడి ఎలా ఉంటుందో? అని భయపడుతున్నారు. అయితే ఈ భయాల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ ఏడాది ఎండలు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి రాష్ట్రాలు కచ్చితంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి డేటా సేకరించి అలర్ట్‌గా ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిపై కచ్చితంగా రోజు వారీ నిఘా పెట్టాలని సూచించారు. దేశంలో గుండె వ్యాధి నిఘా కోసం ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ ద్వారా రోజు వారి  నిఘా పెడతామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఆరోగ్య సౌకర్యాలు, రోగి స్థితి, అధిక వేడి వల్ల మరణిస్తే వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించింది. రాష్ట్ర, జిల్లా, నగర ప్రాంతాలకు చెందిన ఆరోగ్య అధికారులతో హీట్ వేవ్స్ వార్తల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రోజు వారీ హీట్ అలర్ట్ వివరాలను ఎప్పటికప్పుడు తమకు పంపాలని కేంద్రం కోరింది. ఈ సమాచారం వెంటనే చేరడం ద్వారా ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక అమలు చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 36.40 సెల్సియస్ నుంచి 37.20 సెల్సియస్ వరకూ ఉంటుంది. అధిక బహిరంగ లేదా ఇండోర్ ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వేడి ఒత్తిడికి దారితీస్తుందని, హీట్ దద్దుర్లు, కండరాల తిమ్మిరి, మూర్ఛ, వేడి అలసట, హీట్ స్ట్రోక్ వంటి అనారోగ్యాలకు దారితీస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో గుండె వైఫల్యం తీవ్రతరం అవ్వడంతో పాటు నిర్జలీకరణం నుంచి తీవ్రమైన కిడ్నీ గాయం వంటివి సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వార్తలు నేపథ్యంలో ఎండ వేడిమి సమయంలో అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ముఖ్యంగా మార్చి నుంచి మే మధ్యలో హీట్ వేవ్ అధికంగా ఉంటుందని కచ్చితంగా రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..