పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ ఇంటి వద్ద శిరోమణి అకాలీదళ్ భారీ ప్రదర్శన…..సుఖ్ బీర్ సింగ్ బాదల్ అరెస్ట్

పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ ఇంటివద్ద మంగళవారం శిరోమణి అకాలీదళ్ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. శివాన్ లో జరిగిన ఈ ప్రొటెస్ట్ లో వందలాది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను వినియోగించారు.

పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ ఇంటి వద్ద శిరోమణి అకాలీదళ్ భారీ ప్రదర్శన.....సుఖ్ బీర్ సింగ్ బాదల్ అరెస్ట్
Sukhbir Singh Badal Arrest

Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2021 | 3:43 PM

పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ ఇంటివద్ద మంగళవారం శిరోమణి అకాలీదళ్ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. శివాన్ లో జరిగిన ఈ ప్రొటెస్ట్ లో వందలాది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను వినియోగించారు. వ్యాక్సినేషన్, ]ఎస్సీల స్కాలర్ షిప్ లలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, రైతుల భూములను కబ్జా చేస్తున్నారని ఈ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్ బీర్ సింగ్ సిద్దును బర్తరఫ్ చేయాలనీ వీరు డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ల అమ్మకాల్లోనూ, కోవిద్ రోగులకు మెడికల్ కిట్ల సేకరణలోనూ అక్రమాలు జరిగాయని పార్టీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. కాగా ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా నిన్న సీఎం ఇంటిముందు ప్రొటెస్ట్ చేశారు. ఈ అవినీతి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలన్నారు. కేబినెట్ మంత్రి సాధుసింగ్ ని తొలగించాలని,ఎస్సీలకు స్కాలర్ షిప్ నిధుల్లో అవకతవకలకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ స్కాలర్ షిప్ల వ్యవహారంలో గత ఏడాది రూ. 64 కోట్ల అవినీతి జరిగిందని ఆప్ నేతలు ఆరోపించారు. అలాగే వ్యాక్సిన్ల అమ్మకాల్లోనూ గోల్ మాల్ జరిగిందన్నారు.అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యాన ఈ కమిటీ తన నివేదికను సమర్పించగానే బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.