Duologue with Barun Das: ఇన్ఫోసిస్ విజయానికి అదే కారణం.. డ్యూలాగ్ విత్ బరున్ దాస్‌లో నారాయణ మూర్తి జంట ఆసక్తికర విషయాలు.
TV9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరున్ దాస్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న డ్యూలాగ్ విత్ బరున్ దాస్ కార్యక్రమంలో.. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ జంట పలు..

TV9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరున్ దాస్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న డ్యూలాగ్ విత్ బరున్ దాస్ (Duologue With Barun Das) కార్యక్రమంలో.. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ జంట పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నారాయణ్ మూర్తి భారతీయ ఐటీ రంగానికి చెందిన ప్రముఖుడు కాగా… ఆయన భార్య సుధా మూర్తి ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అనే విషయం తెలిసిందే. సుధామూర్తికి తాను చేసిన సేవలకుగాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్‌తో సత్కరించిన విషయం తెలిసిందే. సుధామూర్తి పద్మభూషణ్ అందుకున్న వెంటనే బ్రిటన్ ప్రధాని, ఆమె అల్లుడు.. రిషి సునాక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన విషయం విధితమే.
ఈ ఇంటర్వ్యూలో ఈ జంట.. జీవితంలో తాము ఎదుర్కొన్న అనేక సమస్యల గురించి వివరించారు. తన భర్త నారాయణ మూర్తి వ్యాపార రంగంలో తన కలను సాకారం చేసుకోవడానికి ఎలాంటి విధానాన్ని అనుసరించాడన్న విషయాలను సుధామూర్తి తొలిసారి పంచుకున్నారు. తన పిల్లలకు ఉత్తమమైన తల్లిగా బాధ్యతను ఎలా నిర్వహించారో సుధామూర్తి చెప్పుకొచ్చారు. సుధా మూర్తికి ఉన్న విద్యార్హతల ఆధారంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడిగా ఎందుకు నియమించలేదని.. నారాయణ మూర్తిని బరున్ దాస్ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన నారాయణ మూర్తి.. ‘ఈ విషయమై మేమిద్దరం మొదట్లో చర్చించాం. వ్యవస్థాపకుడు, సహ వ్యవస్థాపకుల భార్యలందరిలో.. సుధానే అత్యంత అర్హత కలిగి ఉంది. అయితే సంస్థలో మేమిద్దరం ఉండాలా.. లేక ఇద్దరిలో ఒకరు ఉండాలా అని చర్చించాము. ఆ సమయంలో నేను వ్యవస్థాపకుల్లో అనవసరమైన ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నించాను’ అని మూర్తి చెప్పుకొచ్చారు. ఇక మూర్తి చెప్పిన మాటలతో ఏకీభవించిన సుధా మూర్తి.. తన చిన్నతనంలో, నారాయణమూర్తి సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్మించాలని కలలు కన్నారని గుర్తు చేసుకున్నారు.
నారాయణమూర్తి, సుధామూర్తి ఉత్తమ జంటగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇద్దరూ చేరో మార్గంలో ముందుకు వెళ్లారు. ఒకరు వ్యాపారాన్ని చేపడితే మరొకరు సమాజం పట్ల శ్రద్ధతో బాధ్యత తీసుకున్నారు. అసంఖ్యాకమైన అవకాశాలను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించారని టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ.. హోస్ట్ బరున్ దాస్ అన్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తితో మాట్లాడుతోన్న సమయంలో వారితో చాలా ఇంప్రెస్ అయ్యానన్నారు. ఆ జంట నుంచి ఎంతో స్ఫూర్తి పొందినట్లు చెప్పుకొచ్చిన బరున్ దాస్.. ఇన్ఫోసిస్ వంటి సంస్థ అభివృద్ధి ప్రయాణం అతని సంకల్పం, బలమైన నాయకత్వమే కారణమని ప్రశంసించారు.



ఇదిలా ఉంటే నారాయణమూర్తి, సుధామూర్తితో జరిగిన డ్యూయలాగ్ విత్ బరున్ దాస్ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే తొలి న్యూస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘న్యూస్ 9 ప్లస్’లో వీక్షించవచ్చు. ఈ కార్యక్రాన్ని మూడు ఎపిసోడ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. వీటిలో జీవితం, వ్యాపారం, ఇన్ఫోసిస్ స్థాపనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ ఆదర్శ జంట పంచుకున్నారు. న్యూస్9 ప్లస్ యాప్‌ను ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..