COVID Vaccine: కరోనా వ్యాక్సిన్‌కు.. గుండెపోటు ముప్పుకు సంబంధం ఉందా ?.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతాలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో కరోనా విజృంభణ తర్వాత గుండెపోటు ముప్పు ఎక్కువగా పెరిగిందనే ఊహగానాలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ప్రభావం గుండెపోటు కేసులు పెరగడానికి ఏదైనా అనే అనుమానాలు ఎన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇండియాలో ఉపయోగించిన కరోనా వ్యాక్సిన్లను.. గుండెపోటు ముప్పు పెరుగదలకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం పేర్కొంది.

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్‌కు.. గుండెపోటు ముప్పుకు సంబంధం ఉందా ?.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు
Covid Vaccine

Updated on: Sep 04, 2023 | 8:50 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతాలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో కరోనా విజృంభణ తర్వాత గుండెపోటు ముప్పు ఎక్కువగా పెరిగిందనే ఊహగానాలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ప్రభావం గుండెపోటు కేసులు పెరగడానికి ఏదైనా అనే అనుమానాలు ఎన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇండియాలో ఉపయోగించిన కరోనా వ్యాక్సిన్లను.. గుండెపోటు ముప్పు పెరుగదలకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం పేర్కొంది. ఇండియాలో తయారైన కరోనా వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌వన్ జర్నల్‌లో ప్రచూరితమైంది. భారత్ వ్యాక్సిన్‌లు సేఫ్ అని .. అసలు దేశంలో నమోదవుతున్న గుండెపోటుకు వ్యాక్సిన్‌లకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

అలాగే కరోనా టీకా తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని.. ఈ అధ్యయయానికి నేతృత్వం వహించిన జీబీ పంత్ హాస్పిటల్‌కు చెందిన మోహిత్ గుప్తా పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ ఎప్పుడూ కూడా కనిపించడం లేదని తమ అధ్యయనంలో తేలినట్లు వెల్ల డించారు. ఇక హాస్పిటల్లో చేరిన ఏఎంఐ బాధితుల్లో.. వయసు, ధుమపానం, మధుమేహం కారణాల వల్లే మరణాల ముప్పు ఎక్కువగా కనిపించినట్లు పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే ఇది ఒక కేంద్రంలో జరిపినటువంటి అధ్యయనమని.. అలాగే ఇందుకు సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. గుండెపోటు వచ్చిన తర్వాత బాధితుల మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రభావం ఏదైన ఉందా లేదా.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు గత ఏడాది మన దేశంలో అధ్యయనం జరిగింది.

అయితే ఈ అధ్యయనం కోసం ఢిల్లీలోని జీబ్ పంత్ హాస్పిటల్‌లో ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2022 కాల వ్యవధిలో చేరిన దాదాపు 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషణ చేశారు. అయితే వీరిలో 1086 మంది కరోనా టీకా తీసుకున్నవారు ఉన్నారు. ఇక మిగిలిన 492 మంది టీకా తీసుకోని వారే ఉన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు 1047 మంది రెండు డోసులు తీసుకున్నారు. అలాగే మరో 4 శాతం మంది కేవలం ఒక్క డోసు మాత్రమే తీసుకున్నారు. అయితే గుండెపోటుకి కరోనా వ్యాక్సిన్‌కు అసలు ఎలాంటి సంబంధం లేదని అధ్యయనంలో తేలడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇది ఉపశమనమిచ్చే సమాచారం. ఇదిలా ఉండగా 2020లో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..