Telugu News India News Students washing Bathrooms video was gone viral in social media Telugu news
Uttar Pradesh: స్కూల్ కు లేట్ గా వచ్చారని స్టూడెంట్స్ తో టాయిలెట్లు కడిగించాడు.. ప్రిన్సిపల్ తీరుపై నెటిజన్లు ఫైర్
విద్యార్థులు తెలిసో తెలియక తప్పు చేస్తే వాటిని సరిదిద్ది మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఒక్కోసారి దారుణంగా..
విద్యార్థులు తెలిసో తెలియక తప్పు చేస్తే వాటిని సరిదిద్ది మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఒక్కోసారి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పనిష్మెంట్ పేరుతో క్రూరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వైరల్ గా మారింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో ప్రిన్సిపల్ చేసిన పని నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వారితో అమానవీయంగా ప్రవర్తించాడు. మరుగుదొడ్లను కడిగించాడు. అంతే కాకుండా సరిగ్గా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని హెచ్చరించాడు. దీంతో గత్యంతరం లేక పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్లు శుభ్రం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో ప్రిన్సిపల్ చేసిన పని ప్రస్తుతం నెటిజన్లు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ స్కూల్‌లోని విద్యార్థులతో ప్రిన్సిపల్ వాష్‌రూమ్‌లను శుభ్రం చేయించాడు. అంతే కాదు వారి పక్కనే నిలబడి సూచనలు ఇస్తూ టాయిలెట్లు కడిగించాడు. సరిగా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు.
Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh.
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీశాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసి వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో కొందరు విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండటాన్ని చూడవచ్చు. ఈ వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందున మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్కి వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.