ఎంతకు తెగించావ్‌రా.. మహిళా ప్రొఫెసర్‌‌కు వాట్సప్ కాల్ చేసిన స్టూడెంట్.. ఆ తర్వాత నగ్న వీడియోలతో..

Student threatens professor: చదువుకోవాల్సిన వాడే దారితప్పాడు.. గురువుతో ఉన్న సఖ్యతను.. తనకు అనుకూలంగా మలుచుకుని దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఏకంగా.. మహిళా ప్రొఫెసర్‌ను నగ్నంగా వీడియోలు తీసి.. ఆ తర్వాత

ఎంతకు తెగించావ్‌రా.. మహిళా ప్రొఫెసర్‌‌కు వాట్సప్ కాల్ చేసిన స్టూడెంట్.. ఆ తర్వాత నగ్న వీడియోలతో..
Woman

Updated on: Jun 25, 2023 | 8:47 AM

Student threatens professor: చదువుకోవాల్సిన వాడే దారితప్పాడు.. గురువుతో ఉన్న సఖ్యతను.. తనకు అనుకూలంగా మలుచుకుని దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఏకంగా.. మహిళా ప్రొఫెసర్‌ను నగ్నంగా వీడియోలు తీసి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌ కు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. డబ్బు కోసం ఆ వీడియోను ఆమె భర్తకు పంపి రూ. లక్షలు డిమాండ్ చేశాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. పూణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన మయాంక్‌ సింగ్‌ (26) అనే విద్యార్థి ఓ యూనివర్సిటీలో చదువుకునేవాడు.

ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ మహిళా ప్రొఫెసర్‌తో రెండేళ్ల క్రితం చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఆమెకు నేరుగా ఫోన్ చేయడం.. వాట్సాప్‌ కాల్‌ చేయడం ప్రారంభించాడు. అప్పటివరకు ఆమెతో మాట్లాడుతూ వచ్చిన అతను.. ఓరోజు ఆమెకు వీడియోకాల్‌ చేసి తాను చెప్పినట్లు చేయాలని, లేకపోతే.. యూనివర్సిటీలో తన పరువు తీస్తానంటూ బెదిరించాడు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ రికార్డులను యూనివర్సిటీలో బయటపెడతానని హెచ్చరించడంతో.. మహిళా ప్రొఫెసర్.. నిందితుడు చెప్పినట్లు నగ్నంగా కనిపించింది.

అయితే, ఆ దృశ్యాలను రికార్డ్‌ చేసిన మయాంక్‌ సింగ్‌ బ్లాక్‌మెయిలింగ్ పాల్పడ్డాడు. రూ. లక్షలు ఇవ్వాలని లేకపోతే వీడియోలను వైరల్ చేస్తానంటూ టార్చర్ చేశాడు.. దీంతో మంజరికి చెందిన బాధితురాలు, ఆమె భర్త హడప్సర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2020 నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని హడప్సర్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..