Kota: కోటాలో ఆగని సూసైడ్స్‌.. మరో నీట్‌ విద్యార్ధి ఆత్మహత్య! 28కి చేరిన మరణాలు

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది కోటాలో తనువు చాలించిన విద్యార్ధుల సంఖ్య 28కి చేరింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ విద్యార్ధుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేక పోతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫోరిడ్‌ అనే విద్యార్ధి కోటలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలో ప్రైవేట్‌ హాస్టల్‌లో నివసిస్తూ.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్‌ పరీక్షకు..

Kota: కోటాలో ఆగని సూసైడ్స్‌.. మరో నీట్‌ విద్యార్ధి ఆత్మహత్య! 28కి చేరిన మరణాలు
Student Suicide In Kota

Updated on: Feb 13, 2024 | 5:35 PM

కోటా, నవంబర్‌ 28: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది కోటాలో తనువు చాలించిన విద్యార్ధుల సంఖ్య 28కి చేరింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ విద్యార్ధుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేక పోతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫోరిడ్‌ అనే విద్యార్ధి కోటలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలో ప్రైవేట్‌ హాస్టల్‌లో నివసిస్తూ.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ నిన్న సాయంత్రం తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు.

వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరిడ్ ఉంటోన్న హాస్టల్‌లోని ఇతర విద్యార్థులు సాయంత్రం 4 గంటలకు అతన్ని చివరిసారిగా చూశామని పోలీసులకు చెప్పారు. రాత్రి 7 గంటల వరకు అతను తన గది నుండి బయటకు రాకపోవడంతో విద్యార్ధులకు అనుమానం వచ్చింది. పైగా వారి ఫోన్‌ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో వెంటనే హాస్టల్‌ యాజమన్యానికి తెలియజేశారు. హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

కాగా విద్యార్ధి గదిలో సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఫోరీడ్ గతేడాది నుంచి కోటాలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. దీంతో కోటాలో నమోదవుతోన్న వరుస ఆత్మహత్యలు మరోమారు చర్చకు వచ్చాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్యం, స్ట్రెస్‌ వారిని మరణం వైపు ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ఈ ఆందోళనకరమైన ధోరణికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలను జారీ చేసింది కూడా. ఆ మార్గదర్శకాల్లో భాగంగా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.