Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parrots: రామ చిలుకలు మనుషుల భాషను ఎలా మాట్లాడగలుగుతాయో తెలుసా? దీని వెనుక సైన్స్ ఇదే

రామ చిలుక గురించ ప్రతి ఒక్కరికీ తెలుసు. పచ్చ రంగులో, ఎర్ర ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇష్టమైన పక్షి గురించి ఎవరైనా అడిగితే అధిక మంది రామ చిలుక పేరు చెబుతుంటారు. రామ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఇవి మనుషులతో కలిసి ఉంటున్నాయి. కొన్ని చిలుకలు మనుషుల భాష నేర్చుకోడానికి ఇదే కారణం. నిజానికి, చిలుకలు సొంతంగా మాట్లాలేవు. వాటి ఎదురుగా మీరు ఎదైనా పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే కొన్ని రోజుల తర్వాత అవి కూడా అదే విధంగా మాట్లాడటం ప్రారంభిస్తాయి. అంటే మీరు చెప్పే పదాన్ని అవి మళ్లీమళ్లీ పునరావృతం చేస్తుంటాయి. ఈ లక్షణం మరే పక్షిలోనూ..

Parrots: రామ చిలుకలు మనుషుల భాషను ఎలా మాట్లాడగలుగుతాయో తెలుసా? దీని వెనుక సైన్స్ ఇదే
Can Parrots Really Talk
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2023 | 1:48 PM

రామ చిలుక గురించ ప్రతి ఒక్కరికీ తెలుసు. పచ్చ రంగులో, ఎర్ర ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇష్టమైన పక్షి గురించి ఎవరైనా అడిగితే అధిక మంది రామ చిలుక పేరు చెబుతుంటారు. రామ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఇవి మనుషులతో కలిసి ఉంటున్నాయి. కొన్ని చిలుకలు మనుషుల భాష నేర్చుకోడానికి ఇదే కారణం. నిజానికి, చిలుకలు సొంతంగా మాట్లాలేవు. వాటి ఎదురుగా మీరు ఎదైనా పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే కొన్ని రోజుల తర్వాత అవి కూడా అదే విధంగా మాట్లాడటం ప్రారంభిస్తాయి. అంటే మీరు చెప్పే పదాన్ని అవి మళ్లీమళ్లీ పునరావృతం చేస్తుంటాయి. ఈ లక్షణం మరే పక్షిలోనూ కనిపించదు. మనుషుల భాషను అనుకరించేంత ప్రత్యేకత రామ చిలుకల్లో ఏం ఉంది అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? మనుషుల భాషను అనుకరించే ఈ పక్షుల స్వరపేటికలో ఉన్న వింత లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం..

చిలుకల స్వరపేటికలో ఉన్న ప్రత్యేక ఇదే..

కొన్ని వందల సంవత్సరాల క్రితం మానవులు అర్థం చేసుకోలేని ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారు దానిని ఒక అద్భుతంగా చూడటం మొదలుపెట్టేవారు. వారు దాన్ని దేవుడికి అనుబంధించడం ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. నేడు అందుబాటులోకి వచ్చిన యంత్రాలు, సాంకేతికత సహాయంతో మనిషి ప్రతి విషయాన్ని, దాని వెనుక అసలు కారణాన్ని సులువుగా తెలుసుకోగలుగుతున్నాడు. చిలుకలు మాట్లాడటం వెనుక సైన్స్ కూడా తెలుసుకోవడానికి ఇదే కారణం. సైంటిస్టులు చిలుకల శరీర ఆకృతిని పరిశీలించినప్పుడు.. వారికి రామ చిలుకల గొంతులో సిరింక్స్ అనే అవయవం కనిపించింది. ఇది రామ చిలుకల శ్వాసనాళంలో ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. చిలుకలు మానవ భాష మాట్లాడటానికి ఈ అవయవం సహాయపడుతుంది.

వాస్తవానికి, సైంటిస్టులు గత 34 సంవత్సరాలుగా చిలుక మెదడుపై పరిశోధనలు చేస్తున్నారు. చిలుకల మెదడు బయటి వలయంలో ఉండే గుండ్లు ఏ భాషనైనా నేర్చుకోవడంలో సహాయపడతాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. ఈ గుండ్లు ప్రతి చిలుక మెదడు బయటి వలయంలో ఉంటాయి. కానీ చిలుకల షెల్స్‌ ఇతర పక్షుల కంటే చాలా పెద్దవి. అందువల్లనే ఇతర పక్షుల కంటే ఈ పక్షులు ఏ భాషనైనా వేగంగా నేర్చుకోగలవు. మనుషులు మాట్లాడిన పదాన్ని అర్థం చేసుకుని పునరావృతం చేయగలుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.