US Visa: అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లే స్టూడెంట్స్‌కు అలెర్ట్.. వీసాల జారీకి కొత్త నిబంధనలు అమల్లోకి
అమెరికా వెళ్లి చుదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేసి మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని ప్రతి విద్యార్థి కల. అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అందుకోసం తమ శక్తికి మించి మరీ కష్టపడతారు. అయితే తాజాగా విద్యార్థి వీసాలకు అమెరికా ఎంబసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఎఫ్, ఎమ్, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్పులను గమనించాలని కోరింది అమెరికా.
అమెరికా వెళ్లే భారత్ విధ్యార్థులకు అలర్ట్. స్టూడెంట్ వీసాలో కొత్త నిబంధనలు తెచ్చింది అమెరికా. వీసా దరఖాస్తు ప్రక్రియలో చేసిన సవరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్, ఎమ్, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్పులను దృష్టిపెట్టుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్‌మెంట్ సిస్టమ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు యూఎస్ ఎంబసీ తెలిపింది. అయితే ఈ వీసాలు అకడమిక్, ఒకేషనల్, ఎక్స్ఛేంజ్ స్టూడెంట్స్ కోసం జారీ చేస్తుంటారు. వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్ట్ సమాచారాన్నే వినియోగించాలని తెలిపింది. తప్పుడు పాస్‌పోర్ట్ నంబరు ఇస్తే.. ఆ ధరఖాస్తులను వీసా అప్లికేషన్ సెంటర్ల దగ్గర తిరస్కరిస్తారని హెచ్చరించింది. అంతేకాకుండా తప్పుడు సమచారం ఇచ్చిన వారి అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తారని.. వీసా ఫీజులను కూడా రిటన్ చేయరనిచెప్పింది.
రాంగ్ పాస్‌పోర్ట్ నంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. తిరిగి సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలని సూచించింది. పాత పాస్‌పోర్టు పోవడం లేదా దొంగిలించబడితే కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్నవారు, కొత్తగా పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్నవారు.. పాత పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలని తెలిపింది. ఎఫ్, ఎమ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ అవసరం అవుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..