AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: జుట్టుకు రంగేసుకుని స్కూల్ కి వచ్చిన స్టూడెంట్.. తప్పని చెప్పిన టీచర్లు.. ఆఖరుకు

పాఠశాల అనేది క్రమశిక్షణా నిలయం. విద్యాబుద్ధులు నేర్చుకునే వేదిక. ఉపాధ్యాయుల సమక్షంతో జీవితానికి మంచి బాటలు వేసుకునే కార్యస్థలం. టీచర్లు బోధించే విషయాలను విద్యార్థులు నేర్చుకుని సమాజంలో అభివృద్ధి....

Crime news: జుట్టుకు రంగేసుకుని స్కూల్ కి వచ్చిన స్టూడెంట్.. తప్పని చెప్పిన టీచర్లు.. ఆఖరుకు
Murder Attempt
Ganesh Mudavath
|

Updated on: Mar 28, 2022 | 8:41 AM

Share

పాఠశాల అనేది క్రమశిక్షణా నిలయం. విద్యాబుద్ధులు నేర్చుకునే వేదిక. ఉపాధ్యాయుల సమక్షంతో జీవితానికి మంచి బాటలు వేసుకునే కార్యస్థలం. టీచర్లు బోధించే విషయాలను విద్యార్థులు నేర్చుకుని సమాజంలో అభివృద్ధి చెందగలుగుతారు. అయితే తమిళనాడులో జరిగిన ఓ ఘటన.. యావత్ సమాజాన్ని విస్తుపోయేలా చేసింది. తలకు రంగు వేసుకుని రావద్దని మందలించిన ఉపాధ్యాయులపై ఓ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. గాజు సీసాతో పొడిచేస్తామనంటూ పాఠశాలలో పరుగులు పెట్టించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. ఓ రోజు ఆ విద్యార్థి తలకు రంగు వేసుకుని పాఠశాలకు వచ్చాడు. ఇలా చేయడం మంచిది కాదని, పాఠశాలలో క్రమశిక్షణతో ఉండాలని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మందలించారు. వారితో సదరు విద్యార్థి అనుచితంగా మాట్లాడాడు. దీంతో ఉపాధ్యాయులు అతని తల్లిదండ్రులను పాఠశాలకి పిలిపించారు. జరిగిన విషయాన్ని వారికి వివరించారు.

ఈ క్రమంలో ఆ విద్యార్థి.. శనివారం అకస్మాత్తుగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను గాజు సీసాతో పొడిచేస్తానంటూ వెంబడించడం కలకలం రేపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Also Read

Viral Video: ఏయ్.. నన్నే ఫోటో దింపుతావా?.. పిల్లి దెబ్బకు అబ్బా అన్నా ఫోటోగ్రాఫర్.. ఫన్నీ వీడియో మీకోసం..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

PV Sindhu: తెలుగు తేజంపై ప్రధాని మోడీ ప్రశంసలు.. భావితరాలకు స్ఫూర్తిదాయకమంటూ..