Viral Video: ఏయ్.. నన్నే ఫోటో దింపుతావా?.. పిల్లి దెబ్బకు అబ్బా అన్నా ఫోటోగ్రాఫర్.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: ప్రపంచంలో వివిధ రకాల జంతువులు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి, మరికొన్ని పెంపుడు జంతువులు ఉన్నాయి.

Viral Video: ఏయ్.. నన్నే ఫోటో దింపుతావా?.. పిల్లి దెబ్బకు అబ్బా అన్నా ఫోటోగ్రాఫర్.. ఫన్నీ వీడియో మీకోసం..
Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2022 | 8:34 AM

Viral Video: ప్రపంచంలో వివిధ రకాల జంతువులు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి, మరికొన్ని పెంపుడు జంతువులు ఉన్నాయి. ప్రమాదకరమైన జంతువుల గురించి చెప్పుకోవాలంటే.. సింహం, పులి, చిరుతపులి మొదలైనవి పేర్కొనవచ్చు. అదే సమయంలో పెంపుడు జంతువుల గురించి చూసుకుంటే కుక్క, పిల్లి, గుర్రం, ఏనుగు, ఆవు, గేదె మొదలైనవి చెప్పుకోవచ్చు. ఇంకా వీటిలోనూ ప్రధానంగా కుక్క, పిల్లి ప్రత్యేకమనే చెప్పాలి. రెండు జంతువులు ప్రజల జీవనగమనంలో మమేకమై ఉంటాయి. ప్రజలు కూడా వీటిని పెంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అవి కూడా మనుషులతో కలిసిపోయి.. తమ ప్రేమనంగా ప్రదర్శిస్తాయి. అయితే, ఏమాత్రం తేడా వచ్చినా తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు ఓ వ్యక్తి. పిల్లి ఓ వ్యక్తికి ఊహించని ఝలక్ ఇచ్చింది. పిల్లి దెబ్బకు అతను అబ్బా అంటూ పరుగులు తీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి పిల్లిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, పిల్లికి అతని చర్య ఏమాత్రం నచ్చలేదు. ఆ క్రమంలో తనను ఫోటో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై దాడి చేసింది. దెబ్బకు బెదిరిపోయిన వ్యక్తి.. పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. వెంటనే ఆ మొబైల్‌ను తీసుకుని అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. పిల్లితో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ హితవు చెబుతున్నారు. ఈ వీడియోకు ఆశ్చర్యకరంగా 80 లక్షలకు పైగా వ్యూస్, 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also read:

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..

Toll Plaza: టోల్ ప్లాజాల తొలగింపు.. వాహనదారులకు ఊరట లభించేనా..?

Viral Video: నాకూ ఒకటి కావాలి.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్ర అద్భుతమైన రియాక్షన్..!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు