సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చే విమానాలను నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.సింగపూర్ లో కొత్త కోవిడ్ వేరియంట్ ని కనుగొన్నారని, అది ముఖ్యంగా పిల్లలకు ప్రమాదకరమని తెలిసిందని ఆయన అన్నారు. ఇండియాలో ఇది థర్డ్ వేవ్ కి దారి తీయవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇండియా నుంచి సింగపూర్ వెళ్లే విమానాలను కూడా రద్దు చేయాలని కోరారు. మన దేశంలో యుధ్ధ ప్రాతిపదికన బాలలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ట్వీట్ చేశారు. కాగా సింగపూర్ లో చిన్న పిల్లల్లో కొందరికి ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కనబడడంతో మంగళవారం నుంచి స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు మూసివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 వరకు ఈ విద్యాసంస్థలు మూసి ఉంటాయని అధికారులు నిన్న వెల్లడించారు. ఇండియాలోని బీ.1,617 వేరియంట్ వీరిలో కనబడిందని వారు పేర్కొన్నారు.
ఇలా ఉండగా మహారాష్ట్ర, కర్ణాటకతో బాటు కొన్ని రాష్ట్రాలు అప్పుడే మూడో కోవిడ్ ని ఎదుర్కోవడానికి సన్నాహాలు ప్రారంభించాయి. మహారాష్ట్ర చైల్డ్ కోవిడ్ సెంటర్లను, పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. కర్ణాటక కూడా ఇలాగే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించింది. 18 ఏళ్ళ లోపువారికి వేర్వేరు వెంటిలేటర్ బెడ్స్ ఇతర మెడికల్ ఈక్విప్ మెంట్ అవసరమని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోప్ పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ళ లోపు వారిపై కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహణకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఇక 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు ఫైజర్, బయో ఎన్ టెక్ టీకామందులను ఇవ్వాలన్న ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..