AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్.!

ఓ వ్యక్తి కడుపు ఉబ్బిపోయి ఆసుపత్రికొచ్చాడు. ఏం జరిగిందో ఏంటో చెప్పకపోవడం.. వైద్యులు ఎక్స్‌రే..

Viral: కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్.!
Scanning
Ravi Kiran
|

Updated on: Aug 22, 2022 | 2:02 PM

Share

ఓ వ్యక్తి కడుపు ఉబ్బిపోయి ఆసుపత్రికొచ్చాడు. ఏం జరిగిందో ఏంటో చెప్పకపోవడం.. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోవాలని సూచించారు. వైద్యపరీక్షల అనంతరం వచ్చిన ఎక్స్‌రే రిపోర్ట్ చూసిన డాక్టర్లు ఒక్కసారి ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కృష్ణ రౌత్ కడుపు ఉబ్బిపోయి.. విపరీతమైన నొప్పితో ఎంకేసీజీ ఆసుపత్రికి వచ్చాడు. ఎక్స్‌రే చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వైద్య పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసిన డాక్టర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అతడి పేగుల్లో గ్లాసు ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. అది అసలు ఎలా వెళ్ళిందా అని కృష్ణ రౌత్‌ను అడగ్గా మొదట పొంతలేని సమాధానాలు ఇచ్చాడు.

ఆ తర్వాత డాక్టర్లు రెట్టించి అడగ్గా అసలు విషయం బయటపట్టాడు. 10 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నానని.. ఆ సమయంలో మద్యం మత్తులో తాను పడి ఉంటే.. తన స్నేహితులు మలద్వారం నుంచి స్టీల్ గ్లాస్ జొప్పించారని చెప్పాడు. తన కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని చెప్పలేదని తెలిపాడు. నొప్పి భరించలేనంతగా ఉండటంతో సూరత్ వదిలి గంజాంలోని తన స్వగ్రామానికి చేరుకున్నానని.. అక్కడ తన రిలేటివ్స్ సలహా మేరకు ఆస్పత్రికి వచ్చానని మొత్తం విషయాన్ని వెల్లడించాడు.

మరోవైపు డాక్టర్లు.. మొదటిగా ఆ గ్లాస్‌ను పురుషనాళం ద్వారా తీసేందుకు ప్రయత్నించారు. అయితే వారు విఫలం కావడంతో.. దాదాపు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి స్టీల్ గ్లాస్‌ను బయటికి తీశారు. కాగా, ప్రస్తుతం కృష్ణ రౌత్ కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..