‘అసమ్మతీయులపై’ ఎదురుదాడికేనా ? సోనియా సరికొత్త వ్యూహం
గతనెలలోకాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి మూల కారణమైన లేఖ తాలూకు 'సెగ' ఇంకా చల్లారలేదు. ఆ లేఖపై సంతకాలు చేసిన 23 మంది నేతలతో బాటు ఇతరులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సమావేశమవవుతున్నారు.
గతనెలలోకాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి మూల కారణమైన లేఖ తాలూకు ‘సెగ’ ఇంకా చల్లారలేదు. ఆ లేఖపై సంతకాలు చేసిన 23 మంది నేతలతో బాటు ఇతరులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సమావేశమవవుతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని హఠాత్తుగా ఏర్పాటు చేశారు. వీరితో ఆమె వర్చ్యువల్ గా ఇంటరాక్ట్ కానున్నారు. గత ఆగస్టు 24 న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తరువాత మళ్ళీ ‘ఉన్నత స్థాయి భేటీ’ జరగబోవడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ లో ‘అసమ్మతివాదులు’ గా ముద్ర పడిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఉండడం విశేషం.
ఇలాంటివారిని ‘తటస్థం’ చేసేందుకు సోనియా ఇప్పటికే పార్లమెంటరీ పార్టీలో తన విధేయులను చేర్చుకున్నారు. స్ట్రాటజీ గ్రూప్ లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి వారు కూడా ఉన్నారు. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఆర్డినెన్సులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయనుంది. పీఎం కేర్స్ ఫండ్, ఎంపీ ల్యాడ్స్ ను రెండేళ్ల పాటు నిలిపివేయాలన్న నిర్ణయం వంటి వాటిని పార్టీ వ్యతిరేకిస్తోంది. అయితే ఇదే సమయంలో టాక్సేషన్ ఆర్డిసెన్స్ ను సమర్థిస్తోంది.
ఇక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలను ఎలా ఎండగట్టాలన్నఅంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తానికి కొత్త ‘అసమ్మతివాదులను’ ఎలా విధేయులుగా మార్చుకోవాలన్నదానిపై సోనియా, ఆమె విధేయులు ఈ మీటింగ్ లో ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లవచ్చు.