కరోనా మృతదేహాల అంతిమ సంస్కారాలపై రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా రాకాసి బారినపడి ప్రాణాలు హరిస్తే.. అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది. దహనసంస్కారాలకు నోచుకోక అనాథ శవాల్లా మారిపోతున్నారు. దీంతో రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా మృతదేహాల అంతిమ సంస్కారాలపై రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 08, 2020 | 11:34 AM

కరోనా మహమ్మారి వ్యక్తికి వ్యక్తి మధ్య దూరాన్ని పెంచింది. వైరస్ సోకిందంటే రక్త సంబంధీకులే దరి చేరని పరిస్థితి నెలకొంది. కరోనా రాకాసి బారినపడి ప్రాణాలు హరిస్తే.. అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది. దహనసంస్కారాలకు నోచుకోక అనాథ శవాల్లా మారిపోతున్నారు. దీంతో రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా మృతులకు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించవచ్చని తేల్చి చెప్పింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆసుపత్రి వర్గాలవారు కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ మృత దేహాలను ప్యాక్‌చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలిపింది. కుటుంబసభ్యుల మృతదేహాలకు స్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.