భారత్ లో కొత్తగా 75,809 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. నిన్న రికార్డుస్థాయిలో కేసులు నమోదు కాగా, ఇవాళ కాస్త తగ్గుమొఖం పట్టింది.

భారత్ లో కొత్తగా 75,809 కరోనా కేసులు
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 08, 2020 | 11:13 AM

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. తొలుత మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వైరస్‌, ఇప్పుడు పల్లెపల్లెలకూ విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. నిన్న రికార్డుస్థాయిలో కేసులు నమోదు కాగా, ఇవాళ కాస్త తగ్గుమొఖం పట్టింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 75,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 1,133 మంది కరోనా బారిన పడి మరణాలు నమోదయినట్లు వెల్లడించింది. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423 చేరుకుంది. ఇందులో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,83,697 ఉండగా, ఇప్పటివరకూ 33,23,951 మంది కరోనా వైరస్ ను జయించి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికా ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. భారత్‌లో కరోనా టెస్టుల సంఖ్యను భారీగా పెంచడంతో కేసులూ గతంతో పోల్చుకుంటే ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.