Viral: వామ్మో! ఎలక్ట్రిక్ మెషిన్ల చాటున చీకటి ఎవ్వారం.. అధికారులు చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

పంచ్ డైలాగుల ప్రభావం అటుంచితే.. సినిమాల ప్రభావం అందరిపై బాగా పడిందని తెలుస్తోంది. ఇక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు తెలివిగా..

Viral: వామ్మో! ఎలక్ట్రిక్ మెషిన్ల చాటున చీకటి ఎవ్వారం.. అధికారులు చెక్ చేయగా మైండ్ బ్లాంక్..
1
Follow us

|

Updated on: May 25, 2022 | 5:21 PM

గోల్డ్‌కు ఇండియాలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది స్మగ్లర్లు దీనిని అక్రమ వ్యాపారంగా ఎంచుకుని.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి రకరకాల పద్దతుల్లో పసిడి దేశంలోకి వస్తుంది. ఇక అలా వచ్చిన గోల్డ్‌ను స్మగ్లర్లు ప్రభుత్వ సుంకానికి ఎగనామం పెట్టి.. బంగారం అధికంగా వినియోగించే ప్రదేశాలకు సరఫరా చేస్తుంటారు. తాజాగా విదేశాల నుంచి బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు స్మగ్లర్లను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ సిండికేట్‌లోని సభ్యులైన ఈ ఇద్దరి దగ్గర నుంచి సుమారు 7.39 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ముందుగా అందిన పకడ్బందీ సమాచారంతోనే డీఆర్ఐ అధికారులు.. ముంబై విమానాశ్రయంలో స్మగ్లర్ల కోసం మాటు వేశారు. హాంకాంగ్ నుంచి వచ్చిన కార్గోలో స్మగ్లర్లు బంగారాన్ని దాచిపెట్టారని తెలుసుకున్న అధికారులు.. ఆ విమానంలో వచ్చిన ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే వారికి ఇద్దరిపై అనుమానం రావడంతో.. సదరు వ్యక్తుల దగ్గర ఉన్న లగేజీని చెక్ చేయగా.. అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దాదాపుగా 30 ఎలక్ట్రిక్ బ్రేకర్ మెషిన్ల సిలిండరికల్ లోబ్స్‌లో ఆ వ్యక్తులు బంగారాన్ని అమర్చిన తీరుకు అధికారులు షాక్ అయ్యారు. దీనితో కస్టమ్స్ క్లియరెన్స్ ద్వారా బంగారాన్ని ఎయిర్‌పోర్ట్ దాటించాలనుకున్న స్మగ్లర్ల ప్లాన్‌కు అధికారులు తెలివిగా చెక్ పెట్టినట్లు అయింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.