Crime News: పట్ట పగలే న్యాయవాది దారుణ హత్య.. వేట కొడవళ్లతో దాడి చేసిన దుండగులు..

|

Sep 08, 2022 | 10:50 AM

మూడు బైకుల మీద వచ్చిన ఆరుగురు దుండగులు స్వామినాథన్‌పై మెరుపుదాడి చేశారు. క్షణాల్లో కత్తిపోట్ల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో స్వామినాథన్‌ అక్కడికక్కడే చనిపోయాడు.

Crime News: పట్ట పగలే న్యాయవాది దారుణ హత్య.. వేట కొడవళ్లతో దాడి చేసిన దుండగులు..
Crime News
Follow us on

Chennai Advocate Murder: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. మద్రాసు హైకోర్టు న్యాయవాదిని దుండగులు పట్టపగలే నరికిచంపారు. అరియలూరులోని టీ-పజూర్‌లో బంధువుల వివాహానికి అడ్వకేట్‌ హాజరు కాగా.. మండపం సమీపంలో మాటు వేసిన దుండగులు వేట కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈఘటన కలకలం రేపింది. మూడు బైకుల మీద వచ్చిన ఆరుగురు దుండగులు స్వామినాథన్‌పై మెరుపుదాడి చేశారు. క్షణాల్లో కత్తిపోట్ల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో స్వామినాథన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. దుండగులు లాయర్‌పై కత్తులతో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. హత్య తర్వాత బైకులపై పరారైన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫూటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడిని హైకోర్టు న్యాయవాది స్వామినాథన్‌గా గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎస్ సామినాథన్ (37) టి-పాజూర్ సమీపంలోని అనైకుడం గ్రామంలో బుధవారం తన సోదరి వివాహానికి వచ్చారని.. ఈ సమయంలో దుండగులు దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా హత్య చేసినట్లు తెలిపారు. స్వామినాథన్ ఫంక్షన్‌లో పాల్గొన్న తర్వాత సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. ఈ సమయంలో మారణాయుధాలతో విరుచుకుపడ్డారని పేర్కొన్నారు.

జయంకొండం డీఎస్పీ కలై కతిరవన్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జయంకొండ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..