Shraddha Murder Case: తవ్వేకొద్ది సంచలనాలు.. 20 రోజులకే అప్తార్ వలలో చిక్కిన శ్రద్ధా.. డ్రగ్స్ మత్తులో గతంలోనే మర్డర్ ప్లాన్

తోష్ పర్యటనలో పర్వతాలపై ట్రెక్కింగ్ కు వెళ్ళారు.. అప్పుడే శ్రద్ధను చంపాలని అప్తాబ్ భావించాడు.. కొండపై నుంచి శ్రద్ధను కిందకు తోసి చంపాలని భావించాడు.. అయితే లాస్ట్ మినిట్ లో ఒకవేళ శ్రద్ధ బతికే తాను దొరికిపోతానని ఆలోచించి హత్య ప్లాన్ ను వాయిదా వేశాడు. 

Shraddha Murder Case: తవ్వేకొద్ది సంచలనాలు.. 20 రోజులకే అప్తార్ వలలో చిక్కిన శ్రద్ధా..  డ్రగ్స్ మత్తులో గతంలోనే మర్డర్ ప్లాన్
Shraddha Murder Case
Follow us

|

Updated on: Nov 22, 2022 | 11:55 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో రోజుకో కొత్త కోణాలు తెరపైకి వచ్చి షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సహజీవనం చేస్తున్న భాగ్యస్వామి శ్రద్ధను హత్య చేయడానికి కారణం ఏమిటి అనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం.. డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వామి అవ్వడానికి నిరాకరించడంతో పాటు.. తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అఫ్తాబ్‌ ను అడగడమే శ్రద్ధ మృతికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.. ఆ కోణంలోనే విచారణ జరుపుతున్న పోలీసులకు హిమాచల్ ప్రదేశ్‌లోని తోష్‌లో విచారణ జరిపిన తర్వాత.. ముఖ్యమైన విషయాలు తెలిసినట్లు సమాచారం.

శ్రద్దా, అప్తాబ్ లకు బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ పరిచయమైన 20 నుంచి 25 రోజుల్లోనే ప్రేమ అంటూ ముంబైలోనే సహజీవనం మొదలు పెట్టారు. అయితే శ్రద్ధకు వాళ్ళ అమ్మ మరణంతో నామినిగా భారీగా నగదు వచ్చింది. ఆ డబ్బులను శ్రద్ధ నుంచి అప్పుగా తీసుకున్న అప్తాబ్ విలాసాలకు ఖర్చు చేయడం, డ్రగ్స్ కు బానిసగా మారాడు. అంతేకాదు శ్రద్ధకు కూడా డ్రగ్స్ ను అలవాటు చేసినట్లు తెలుస్తోంది. ఇతర అమ్మాయిలను కూడా తీసుకుని వచ్చేవాడు దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు మొదలయ్యాయి. తన డబ్బులను తిరిగి ఇవ్వమని శ్రద్ధ అడిగినప్పుడల్లా అప్తాబ్ ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి గొడవ పడడమేకాదు.. కొట్టడం కూడా చేసేవాడని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు తరచుగా డ్రగ్స్ కోసం శ్రద్ధను డబ్బులు ఇవ్వమని హింసించేవాడని సమాచారం..

తరచుగా డబ్బులు అడుగుతుందని అప్పట్లోనే శ్రద్ధలను చంపడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ లో భాగంగానే ముంబై నుంచి కొత్త జీవితం అంటూ శ్రద్ధను ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్ పర్యటనకు తీసుకుని వెళ్ళాడు. కొన్ని నెలలు.. హరిద్వార్, రిషికేశ్‌, కసోల్, మనాలి, తోష్ వంటి ప్రాంతాల్లో  పర్యటించారు. అయితే తోష్ పర్యటనలో పర్వతాలపై ట్రెక్కింగ్ కు వెళ్ళారు.. అప్పుడే శ్రద్ధను చంపాలని అప్తాబ్ భావించాడు.. కొండపై నుంచి శ్రద్ధను కిందకు తోసి చంపాలని భావించాడు.. అయితే లాస్ట్ మినిట్ లో ఒకవేళ శ్రద్ధ బతికే తాను దొరికిపోతానని ఆలోచించి హత్య ప్లాన్ ను వాయిదా వేశాడు.

ఇవి కూడా చదవండి

ఎవరికీ తెలియకుండా.. అనుమానం రాకుండా ఎలా హత్య చేయాలో అలోచించి.. పలు సీరియస్ చూసి గూగుల్ సెర్చ్ చేసి.. కొత్త జీవితం అంటూ శ్రద్ధను ఢిల్లీకి తీసుకుని వచ్చాడు. మే 8 ఈ జంట ఢిల్లీలో అడుగు పెట్టింది. శ్రద్ధ దగ్గర ఉన్న డబ్బులతో ఇల్లు అద్దెకు తీసుకుని జీవితాన్ని ప్రారంభించారు. అయితే శ్రద్ధకు ఉద్యోగం దొరకలేదు.. దీంతో తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వమని తరచుగా అఫ్తాబ్ ను అడగడం ప్రారంభించింది. మరోవైపు శ్రద్ధను డ్రగ్స్ దందాలో భాగస్వామి కావాలని పోరు పెట్టడం మొదలు పెట్టాడు.. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలో అఫ్తాబ్ సహనం కోల్పోయి శ్రద్ధాను దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత శ్రద్ధా ఛాతీపై కూర్చోని గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో 24 గంటల పాటు ఉంచాడు. తర్వాత శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి.. వివిధ ప్రాంతాల్లో విసిరివేశాడు. సోషల్ మీడియాలో కూతురు యాక్టివ్ గా లేకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి ఢిల్లీలోని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రద్దా హత్య విషయం 6 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..